పుట్టగొడుగుల్లా... అక్రమ లేఅవుట్లు

ABN , First Publish Date - 2022-04-14T05:21:32+05:30 IST

అధికార పార్టీ అండదండలు ఉంటే రెవెన్యూ అధికారులకు అడ్డుకట్ట వేసి కోట్లు సంపాదించవచ్చునని నిరూపిస్తున్నారు అక్రమ లేఅవుట్‌ దారులు.

పుట్టగొడుగుల్లా... అక్రమ లేఅవుట్లు
సర్వే నెంబరు 44లో వేసిన లేఅవుట్‌

కోట్లలో వ్యాపారం 

ప్రభుత్వ ఆదాయానికి గండి 


సంబేపల్లె, ఏప్రిల్‌ 13: అధికార పార్టీ అండదండలు ఉంటే రెవెన్యూ అధికారులకు అడ్డుకట్ట వేసి కోట్లు సంపాదించవచ్చునని నిరూపిస్తున్నారు అక్రమ లేఅవుట్‌ దారులు. పంచాయతీ అనుమతి లేదు. వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారలేదు. అయినా కోట్లు సంపాదించ వచ్చునని నిరూపించారు. అక్రమ లేఅవుట్‌తో ప్లాట్లు వేసి కోట్లు సంపా దించిన వైనం సంబేపల్లె మండలంలో చోటు చేసుకుంది. అక్రమ లేఅవు ట్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు హెచ్చరి స్తున్నా అవేమీ తమకు పట్టనట్లు పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు రోజు ఒకటి పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు పాతరేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రెవెన్యూ సిబ్బందిపై అధికార పార్టీ నాయ కుల ఒత్తిడి చేసి లక్షల్లో సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు అన్నీ చూస్తూ ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. సంబేపల్లె మండల హెడ్‌క్వార్టర్‌లో పుట్టగొడుగుల్లా ఏర్పడుతున్న అక్రమ లేఅవుట్లు, సంబేపల్లె గ్రామ పంచాయతీలోని తహసీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ అక్రమ లేఅవుట్లు ఏర్పడ్డాయి. సర్వే నెంబరు 49/1సీలో రెండు ఎకరాల భూమి చదును చేసి ప్లాట్లు చేశారు. సర్వే నెంబరు 44/2లో ఒక ఎకరా చదును చేసి ప్లాట్లు వేసి విక్రయాలు జరుపుతున్నారు. వారి ఇష్టానుసా రంగా 15, 20 అడుగులు అప్రోచ్‌ రోడ్డు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల నుండి వ్యవసాయేతర భూమిగా మార్చుకోలేదు. పంచాయతీ అధికారుల అనుమతి లేదు. అయితే ఈ ప్రాంతాల్లో ప్లాట్లు వేసి క్రయ విక్రయాలు జరిగిపోయాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. గృహ నిర్మాణాలు కూడా చేపట్టడం విశేషం. ప్రభుత్వ నిబందనల ప్రకారం సదరు భూమిని అగ్రికల్చర్‌ నుంచి నాన్‌ అగ్రికల్చర్‌కు మార్చాలి. అనంతరం పంచాయతీ నిబందనల ప్రకారం 40 అడుగులు మెయిన్‌ రోడ్డు 30 అడుగులు అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేయాలి. ప్లాట్‌ వేస్తున్న స్థలంలో పది శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. ఆ స్థలంలో గుడి, బడి వంటి కార్యక్రమాలకు పంచాయతీ వినియోగిస్తుంది. కానీ అలాంటి నిబంధనలు ఏవి పాటించకుండా నేరుగా స్థలాన్ని చదును చేసి ప్లాట్లు వేయడం సొమ్ము చేసుకోవడం జరిగింది. ప్లాట్ల డెవలప్‌మెంట్‌ కోసం ప్రభుత్వ స్థలాల నుంచి ఎర్రమట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆలయానికి గండి కొడుతున్నారు. అక్రమ లేఅవుట్లపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొనుటకు ఉపక్రమిస్తే అధికార పార్టీ నాయకుని ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది ఏమి చేయలేని స్థితిలో ఉంది. జిల్లా అధికారు లు మాత్రం నిబంధనలు లేని లేఅవుట్‌లపై రిజిస్ర్టేషన్‌ చేయవద్దని ఓ వైపు చెబుతున్నప్పటికీ లేఅవుట్‌ దారులు అవేమీ తమకు పట్టనట్లు ప్లాట్లు వేసి విక్రయాలు జరిపి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పటి కైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

తహసీల్దార్‌ వివరణ : ఈవిషయంపై తహసీల్దార్‌ సత్యానందంను వివ రణ కోరగా ఇంకా ల్యాండ్‌ కన్వర్షన్‌ కాలేదు. నోటీసులు జారీ చేస్తాం. ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపడుతుంటే పదిశాతం రాయల్టీ వసూలు చేస్తాం.   

Updated Date - 2022-04-14T05:21:32+05:30 IST