మురుగు పోయేందుకు దారేది?

ABN , First Publish Date - 2022-03-14T04:35:28+05:30 IST

మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో పోయేందుకు దారిలేక మురుగునీరు ఇదిగో ఇలా వీధుల్లో పారుతోంది.

మురుగు పోయేందుకు దారేది?
బండేపల్లిలో వీధుల్లో పారుతున్న మురుగునీరు

బండేపల్లి వీధుల్లో పారుతున్న వైనం


మనుబోలు, మార్చి 13 : మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో పోయేందుకు దారిలేక మురుగునీరు ఇదిగో ఇలా వీధుల్లో పారుతోంది. బండేపల్లి పంచాయతీలో మురుగు కాలువలు పూడిపోవడం, కొన్ని నెలలుగా మురుగు తీయకపోవడంతో వీధుల్లోకి చేరింది. ఒకప్పుడు ఈ పంచాయతీ మండలంలోనే ఆదర్శగ్రామం. ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న గుండాల వజ్రమ్మ ఈ పంచాయతీ నివాసకులు. ఒక్క బండేపల్లి పంచాయతీనే కాదు.. దాదాపు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఈ దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇటీవల  రూ.కోట్లతో మురుగు కాలువలను అసవరం లేనిచోట కూడా ఎడాపెడా నిర్మించారు. కాలువల నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. ఈ క్రమంలో కాలువలోకి చేరిన మురుగు ముందుకు వెళ్లదు.. వెనుకకు రావు.. దీంతో కొద్దిరోజులకే కాలువలు నిండి దోమలకు స్థావరాలుగా మారుతున్నాయి. ఇప్పటికే దోమల ధాటికి మడమనూరు గ్రామం డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతోంది. పాలకులు, అధికారులు మురుగు పారుదలపై పట్టించుకోవాలని గ్రామస్థులు  కోరుతున్నారు.



Updated Date - 2022-03-14T04:35:28+05:30 IST