విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-16T06:41:45+05:30 IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌, ఏప్రిల్‌ 15 : విద్యుదాఘాతంతో గడ్డి ఐలయ్య (35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో గురువారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నమిలిగొండకు చెందిన ఐలయ్య గ్రామంలో చిన్నచిన్న విద్యుత్‌ మరమ్మతు పనులు చేస్తూ ఉండేవాడు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం విద్యుత్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా కేవలం ట్రాన్స్‌ఫార్మర్‌ మాత్రమే బంద్‌ చేశాడు. సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకోకుండానే స్తంభం ఎక్కడంతో పైనఉన్న 11 కేవీ వైర్‌ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఐలయ్య స్తంభంపై తలకిందులుగా వేలాడి విలవిల కొట్టుకుంటుండడంతో స్థానికులు నిచ్చెన సాయంతో కిందకుదించారు. అనంతరం వరంగల్‌ ఎంజీఎం  ఆస్పత్రికి తరలించగా, గురువారం చికిత్స పొందుతూ ఐలయ్య మృతి చెందాడని తెలిపారు. మృతుడు ఐలయ్య తండ్రి మల్లయ్య గత కొన్నిరోజుల క్రితమే అనారోగ్యంతో మరణించాడు. దీంతో మృతుడి కుటుం బసభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌నాయక్‌ తెలిపారు.

Updated Date - 2021-04-16T06:41:45+05:30 IST