మురిసిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2022-08-14T06:15:29+05:30 IST

మురిసిన మువ్వన్నెల జెండా

మురిసిన మువ్వన్నెల జెండా
దేశభక్తి గీతాలకు నృత్యం చేస్తున్న ఉషారామా విద్యార్థులు

 ఆకట్టుకున్న హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలు 

ఉయ్యూరు, ఆగస్టు 13 : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రదేశాల్లో శనివారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించి జాతీయ పతాకం ఎగుర వేశారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో  అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జంపాన కొండలరావు పాల్గొని జాతీయ పతాకం ఎగుర వేశారు.                 ఫ ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయం వద్ద  చైర్మన్‌ వల్లభనేని సత్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. వైస్‌ చైర్మన్‌ సోలె సురేష్‌బాబు, కమిషనర్‌ చక్కా సత్యనారాయణ, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఫఆర్టీసీ బస్‌స్టాండ్‌ వద్ద ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించి, డిపో మేనేజర్‌ కెఎస్‌ ఆర్‌ క్‌ ప్రసాద్‌ ర్యాలీని ప్రారంభించారు. ప్రధాన సెంటర్‌ వరకు నిర్వహించిన ర్యాలీలో మెకానిక్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఫ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం అధికారి కే.మీనాదేవి  జాతీయ పతా కం ఎగురవేసి బస్‌స్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వ హించారు. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.    

 పెనమలూరు : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్క రించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలని ఏపీ టిడ్కో డైరెక్టరు పత్తిపాటి రాఘవరావు ఆకాంక్షిం చారు. శనివారం స్థానిక టిడ్కో కార్యాలయం నుంచి పోరంకి వరకు టిడ్కో కార్యాలయ అధికారులు, సిబ్బంది నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బి చిన్నోడు, డీఈ సుధాకర్‌, ఏఈలు పాల్గొన్నారు.

ఫస్థానిక విజయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినులు, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం, కానూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు కలిసి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సైకిల్‌ ర్యాలీని ఉత్సాహంగా నిర్వహిం చారు. ర్యాలీలో దేశభక్తి నినాదాలు చేశారు.

ఫఎందరో మహనీయులు తమ ప్రాణత్యాగాలతో సంపాదించి పెట్టిన స్వాతంత్య్ర ఔన్న త్యాన్ని గుర్తించి మెలగాలని స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల ఏఓ సాయిబాబు పేర్కొన్నారు. శనివారం కశాశాల పరిపాలనా అధికారులు, సిబ్బంది నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారి రామయ్యచౌదరి, పీవీ కేశవరావు, సిబ్బంది పాల్గొన్నారు.

 విజయవాడ రూరల్‌  : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా  నున్నలోని కెనడీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ శనివారం జరిగింది. ఈ ర్యాలీని విద్యా సంస్థల కరెస్పాండెంట్‌ సత్య రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక పాఠశాల నుంచి సూరంపల్లి మహిళా ఇండస్ట్రీ వరకు ర్యాలీ సాగింది.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎన్‌ రత్నకృష్ణ, సర్పంచ్‌ కె సరళ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలారెడ్డి చంద్రారెడ్డి, డైరెక్టర్‌ భీమవరపు ముత్తారెడ్డి పాల్గొన్నారు.

  హనుమాన్‌జంక్షన్‌  : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం బాపుల పాడు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు భారీ ఎత్తున జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహిం చారు. హైస్కూల్‌ హెచ్‌ఎం టీవీనాగేశ్వరరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సుంకర సుభాష్‌ చంద్రబోస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు హైస్కూల్‌ నుంచి జంక్షన్‌ నాలుగు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కూడలిలో మానవహారం జరిపారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఎంపీపీ వై.నగేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని, సర్పంచ్‌ సరిపల్లి కమలాబాయి, వైసీపీ నాయకులు నక్కా గాంధీ, కొమరవల్లి కిరణ్‌మూర్తి, బీజేపీ నాయకులు తోట మురళీధర్‌,  సీఐ కె.సతీష్‌, ఎస్సై సూర్య శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

 ఫ స్థానిక నూజివీడు రోడ్డులోని చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థులు  ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్ర మాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.బలరామ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు  జంక్షన్‌ నాలుగు రోడ్లులో శనివారం ప్రదర్శన చేశారు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  :  వీరవల్లిలో వాణీ విద్యానికేతన్‌, విశ్వభారతి, గీతాంజలి పాఠశాలల ఆధ్వర్యంలో నందిగం రవికుమార్‌, మన్మోహన్‌, ఫిరోజ్‌, పర్యవేక్షణలో 300 అడుగుల భారీ త్రివర్ణ పతాకంచేబూని జాతీయ రహదారి నుంచి గాంధీ విగ్రహం, పంచాయతీ కార్యాలయం మీదుగా ప్రధాన రహదారిపై విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పిల్లా అనిత, రామారావు, ఎస్సై సుబ్రహ్మణ్యం,  కోడెబోయిన బాబి పాల్గొన్నారు. 

ఫకొత్తపల్లిలో ఎంపీపీ స్కూల్‌ హెచ్‌ఎం రామయ్య ఆధ్వర్యంలో విద్యా ర్థులు ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో రమేష్‌, రవితేజ, అన్నపూర్ణ, సుభాషిణి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేలేరు హైస్కూల్‌లో పీడీ టాన్యాగిరి, ఇంచార్జ్‌హెచ్‌ఎం ప్రసాద్‌ల పర్యవేక్షణలో ర్యాలీ నిర్వహించారు.  

ఉంగుటూరు : స్వాతంత్య్ర పోరాటంలో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపినబాటలో ముందుకుసాగాలని డీఎస్పీ కె.విజయపాల్‌ విద్యార్థులకు సూచించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శనివారం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఎన్‌.ఎస్‌.ఎస్‌. విభాగం ఆధ్వర్యంలో విద్యార్ధులు కళాశాల నుంచి పొట్టిపాడు వరకు జాతీయరహదారి వెంట హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ చేపట్టారు.  డీఎస్పీ విజయపాల్‌ ఈ ర్యాలీని ప్రారంభించగా, గన్నవరం, హనుమాన్‌ జంక్షన్‌ సీఐలు శివాజీ, సతీష్‌, ఆత్కూరు ఎస్సై కిషోర్‌కుమార్‌ పర్యవేక్షించారు. కళాశాల డైరెక్టర్‌ కె.రాజశేఖరరావు, ప్రిన్సిపాల్‌ జివికెఎస్‌వి ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ బి.శ్రీహరి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ చినఅవుటపల్లిలోని సీఆర్‌పీఎఫ్‌ 39వ బెటాలియన్‌, పెదఅవుటపల్లిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పెదఅవుటపల్లిలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్లు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు జాతీయ జెండాలతో గ్రామపురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. సర్పంచ్‌ బాణావతు తిరుపతమ్మ, గ్రేడ్‌-5సెక్రటరీ నాగేశ్వరరావు, శ్రీసాయిశ్రీనివాసహైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె.జి.సత్యసాయిబాబా, కమాండెంట్లు రాబిష్‌కుమార్‌, శాంతాదేవి, డిప్యూటీ కమాండెంట్‌ దినేష్‌, బి. ప్రభాకరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T06:15:29+05:30 IST