Viral News: బీచ్‌లో తల లేకుండా అర్ధ నగ్న స్థితిలో యువతి మృతదేహం.. తీరా అసలు విషయం తెలుసుకుని అంతా షాక్!

ABN , First Publish Date - 2022-08-23T22:29:31+05:30 IST

పర్యాటకులు బీచ్‌లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సముద్రాన్ని చూస్తూ ఇసుకలో నడుస్తున్నారు.

Viral News: బీచ్‌లో తల లేకుండా అర్ధ నగ్న స్థితిలో యువతి మృతదేహం.. తీరా అసలు విషయం తెలుసుకుని అంతా షాక్!

పర్యాటకులు బీచ్‌లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సముద్రాన్ని చూస్తూ ఇసుకలో నడుస్తున్నారు. అంతలో వారికి ఇసుకలో తల లేకుండా అర్ధ నగ్నంగా ఉన్న ఓ యువతి మృతదేహం కనిపించింది. దాంతో వారు భయంతో వణికిపోయారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా అక్కడ గడిపిన ఎంతో మంది షాకైపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. అయితే, అంతలోనే అసలు విషయం తెలుసుకుని పోలీసులు సైతం అవాక్కయ్యారు.


థాయ్‌లాండ్‌ (Thailand)లోని బ్యాంగ్ సైయన్ బీచ్‌లో ఈ నెల 18న యువతి మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం అర్ధనగ్నంగా ఉండడంతో ఎవరో ఆమెను అత్యాచారం చేసి చంపేశారని అందరూ భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా కొద్ది సేపటి వరకు అలాగే భావించారు. అయితే అది అమ్మాయి మృతదేహం కాదని, సెక్స్ డాల్ (sex doll) అని తెలుసుకుని అవాక్కయ్యారు. ఇది జపాన్ మోడల్ `ఏవీ ఐడల్` సెక్స్ డాల్ అని తేల్చారు. ఈ సెక్స్ డాల్ ధర దాదాపు 45 వేల రూపాయలు అని సమాచారం. 

Updated Date - 2022-08-23T22:29:31+05:30 IST