మద్యం కోసం హత్య చేశారు..

ABN , First Publish Date - 2021-07-28T07:04:29+05:30 IST

గత సంవత్సరం డిసెంబరు 17న జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ భవ్వకిశోర్‌ తెలిపారు.

మద్యం కోసం హత్య చేశారు..
నిందితులను చూపుతున్న డీఎస్పీ, సిబ్బంది

కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్‌

కదిరి, జూలై 27: గత సంవత్సరం డిసెంబరు 17న జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ భవ్వకిశోర్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ప ట్టణ పోలీసుస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఆమె తెలిపారు. 8 నెలల కిందట (17-12-2020) పట్టణంలోని పాత హరి జనవాడకు చెందిన చరణ్‌తేజ, అరవింద్‌, తనకల్లు మండలం బూడిదగుట్టపల్లికి చెందిన ఎర్రంపల్లి ఆంజనేయులు కదిరి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఉన్న బార్‌లో మద్యం కొనుగోలు చేశారు. మౌనికాథియేటర్‌ దగ్గర ఉన్న శ్మశానం వద్దకు వచ్చి ఖాళీగా ఉన్న స్థలంలో ముగ్గురూ కూర్చుని మద్యం తాగుతున్నారు. ఇంతలో అక్కడకు కదిరిటౌనలో కాపురం ఉండే నూర్‌బాషా అనే దినకూలీ మద్యం తాగడానికి వచ్చాడు. ఈ ముగ్గరు నూర్‌బా షాను మద్యం సీసా ఇవ్వాలని దౌర్జన్యం చేశారు. అందుకు నూర్‌బాషా నిరాకరించాడు. దీంతో ఆంజనేయులు, అరవింద్‌ నూర్‌బాషా చేతులు గట్టిగా పట్టుకోగా చరణ్‌తేజ అక్కడే పాడైపోయి ఉన్న ట్యూబ్‌లైట్‌ పగులకొట్టి గొంతులోకి పొడవడంతో హతుడు వారి నుంచి తప్పించుకుని గట్టిగా అరుస్తూ మదనపల్లి రోడ్డులో ఉన్న మెడ్‌ప్లస్‌ పార్మసీ ఎదుట పడిపోయాడు. తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హత్యకేసులో ముద్దాయిలను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది తెలుసుకున్న నిందితులు సోమవారం మండల వీఆర్‌ఓ జయరామిరెడ్డి ముందు లొంగిపోయారు. వీఆర్‌ఓ నిందితుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి పట్టణ పోలీసుస్టేషనకు అప్పగించారు. నిందితులను  కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ హత్య కేసు చేధించడానికి కృషి చేసిన పట్టణ సీఐ కే శ్రీని వాసులు, ఎస్‌ఐ హేమంతకుమార్‌, క్రైం పార్టీ పోలీసులను డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2021-07-28T07:04:29+05:30 IST