HYD : సినిమాల్లో చూపించినట్లు ముందస్తుగా హెచ్చరించి హత్యలు.. అన్నంత పని చేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-10-18T18:05:47+05:30 IST

పాతనగరంలో మరోసారి హత్యలు కలకలం రేపుతున్నాయి. సినిమాల్లో చూపించినట్లు చెప్పి, టార్గెట్‌ చేసి మరీ చంపుతున్నారు...

HYD : సినిమాల్లో చూపించినట్లు ముందస్తుగా హెచ్చరించి హత్యలు.. అన్నంత పని చేస్తున్నారు..!

హైదరాబాద్‌ సిటీ : పాతనగరంలో మరోసారి హత్యలు కలకలం రేపుతున్నాయి. సినిమాల్లో చూపించినట్లు చెప్పి, టార్గెట్‌ చేసి మరీ చంపుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్టలో ఇదే తరహాలో హత్య జరిగింది. పాతబస్తీలో నేరాల పరిస్థితిపై నాలుగు రోజులు క్రితం హోంమంత్రి స్వయంగా సమీక్షించారు. ముఖ్యంగా సౌత్‌జోన్‌, వెస్ట్‌జోన్‌లలో ఇలాంటి దారుణాలు అధికంగా వెలుగు చూస్తున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఫలక్‌నుమాలో ప్లాన్‌..

ఫలక్‌నుమా పీఎస్‌ పరిధిలో ఓ యువకుడి హత్యకు నలుగురు కుట్ర పన్నారు. ఆ యువకుడి కుటుంబానికి సమాచారం కూడా ఇచ్చారు. భయాందోళకు గురైన కుటుంబీకులు ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లను వెల్లడించారు. విషయాన్ని జీడీ ఎంట్రీలో నమోదు చేసి విచారణ జరపాలని ఫలక్‌నుమా ఎస్‌ఐను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్‌ఐ అనుమానితులను గుర్తించి స్టేషన్‌కు రప్పించారు. కానీ, గంటల వ్యవధిలోనే వారిని తిరిగి పంపించేశారు. దీంతో అనుమానితులు హత్యకు కుట్ర పన్నారా, లేదా, ఎవరైనా కావాలని బెదిరిస్తున్నారా..? అని కుటుంబీకులు అయోమయానికి గురవుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసి మూడు రోజులైంది. అనుమానితులను పోలీసుస్టేషన్‌కు రప్పించిన పోలీసులు అసలేం చేశారు, తమ బిడ్డకు ప్రాణహాని తప్పినట్టేనా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-18T18:05:47+05:30 IST