మద్యం మత్తులో భార్య హతం

ABN , First Publish Date - 2021-06-23T07:38:30+05:30 IST

మద్యం మత్తులో రోకలి బండతో భార్యపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాలో సోమ వారం రాత్రి ఈ ఘటన జరిగింది.

మద్యం మత్తులో భార్య హతం
సునీత ఫైల్‌ ఫొటో

 ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసుల చర్యలు

భువనగిరి రూరల్‌, జూన్‌ 22: మద్యం మత్తులో రోకలి బండతో భార్యపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాలో సోమ వారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాకు చెందిన పానుగోతు లక్ష్మణ్‌ అలియాస్‌ లచ్చు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లక్ష్మణ్‌కు ఇదే తండాకు చెందిన సునీత(35)తో ఇరవై ఏళ్ల క్రితం వివాహంకాగా; ముగ్గురు కుమారులు ఉన్నారు. సునీత చెల్లెలి వివాహానికి జూలై 2న ముహూర్తం కుదిరింది. సోదరికి పెళ్లి దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి సోమవారం భువనగిరికి వచ్చింది. రాత్రి సమయంలో ఇంటికి వెళ్లగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న లచ్చు భార్యతో గొడవకు దిగాడు. గొడవ తీవ్రమవడంతో ఇంట్లో ఉన్న రోకలితో సునీత తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో సునీత అక్కడికక్కడే మృతి చెందటంతో లచ్చు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సునీత మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిఆసుపత్రికి తర లించాల్సి ఉండగా, తండా సమీపంలో సీఎం కేసీఆర్‌ గ్రామసభ ఉండడం, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈ తండా నుంచే వెళతారని ముందస్తు జాగ్రత్తలో భాగంగా రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సునీత మృత దేహాన్ని ఆమె ఇంటి వరండాలోనే ఖననం చేసేందుకు తండావాసులు యత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో సునీత మృతదేహానికి రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయినప్పటికీ మంగళవారం రాత్రి వరకు కుటుంబసభ్యులకు అప్పగించలేదు. పచ్చర్లబోడుతండా సర్పంచ్‌ కునుసోతు రెడ్డినా యక్‌కు సునీత సోదరి కావటంతో; గ్రామంలో ఉద్రిక్తత దృష్ట్యా కుటుంబసభ్యులను భువనగిరి రూరల్‌ సీఐ వి.జానయ్య, ఎస్‌ఐ కె.సైదులు సముదా యిస్తు న్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.సైదులు తెలిపారు.



Updated Date - 2021-06-23T07:38:30+05:30 IST