డబ్బు కోసమే హత్య.. అంగీకరించిన నిందితుడు!?

ABN , First Publish Date - 2021-06-26T19:07:20+05:30 IST

డబ్బుల కోసమే ఇంటి యజమానురాలిని హత్య చేసినట్లు

డబ్బు కోసమే హత్య.. అంగీకరించిన నిందితుడు!?

  • నాలుగు బంగారు గాజులు, రింగ్‌ అపహరణ
  • తాకట్టు పెట్టి అప్పు తీర్చి..
  • ఏమీ తెలియనట్లు మళ్లీ కిరాయి ఇంటికి.. 

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : డబ్బుల కోసమే ఇంటి యజమానురాలిని హత్య చేసినట్లు పోలీసు విచారణలో నిం దితుడు వెల్లడించినట్లు సమాచారం. కానాడిగూడలోని సత్యసాయి ఎన్‌క్లేవ్‌లో ఇంటి యజమానురాలు మంగతాయారు హత్య కేసులో ఇంట్లో అద్దెకు ఉన్న రాజేశ్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో రాజేశ్‌ తెలిసిన వారి వద్ద రూ. 1.30 లక్షలకు పైగా అప్పులు చేశాడు. భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పు చెల్లించేందుకు ఇంటి యజమాను రాలు బంగారు గాజులు దొంగలించాలని నిర్ణయించుకున్నా డు. 


ఇంట్లో నల్లా పని చేయడం లేదంటూ మంగతాయరును తన గదికి పిలిచాడు. ఆమె ఇంట్లోకి రాగానే ఆమెపై దాడి చేసి, కొట్టడంతో కిందపడిపోయింది. వెంటనే ల్యాప్‌టాప్‌ వైర్‌ను మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి, హత్య చేశా డు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులతో పాటు రింగ్‌ను, సెల్‌ఫోన్‌ని తీసుకుని పారిపోయాడు. బంగారు ఆభరణాల ను స్థానికంగా ఓ ఫైనాన్స్‌లో కుదువ పెట్టి రూ. 2 లక్షలు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారికి రూ. 1.35 లక్షలు చెల్లించాడు. మిగతా డబ్బులను బ్యాంక్‌ అకౌంట్లలో వేసుకున్నాడు. 


మంగతాయారు సెల్‌ స్విచ్చాఫ్‌ చేసి మేడ్చల్‌కు వెళ్లి, నిర్జీవ ప్రదేశం సెల్‌తో పాటు సిమ్‌ను విరగొట్టి, పడేశాడు. తర్వాత ఏం తెలియనట్లుగా ఇంటికి వచ్చి, యజమానురాలి గురించి తనకేమీ తెలియదని బుకాయించాడు. పోలీ్‌సులు వెతకగా, మంగతాయారు మృతదేహం రాజేశ్‌గౌడ్‌ నివసిస్తున్న పోర్షన్‌లోని అటాచ్డ్‌ బాత్‌రూమ్‌లో కనిపించింది. దీం తో రాజేశ్‌గౌడ్‌ వ్యవహారం బయటపడింది. రాజేశ్‌ అంతకు ముందే మంగతాయరు వద్ద అవసరాల కోసమంటూ రూ. 15 వేలు కూడా తీసుకున్నాడు.

Updated Date - 2021-06-26T19:07:20+05:30 IST