AP News: విశాఖలో దారుణం.. మరో వాచ్ మెన్ భార్య హత్య

ABN , First Publish Date - 2022-08-15T13:33:01+05:30 IST

పెందుర్తి నియోజకవర్గం పరిధిలో మరో వాచ్ మెన్ భార్య హత్యకు గురైంది.

AP News: విశాఖలో దారుణం.. మరో వాచ్ మెన్ భార్య హత్య

విశాఖ (Visakha): నగరంలో దారుణం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో మరో వాచ్ మెన్ భార్య హత్యకు గురైంది. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు జరిగాయి. వరుస హత్యలతో పెందుర్తి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. సుజాతనగర్, నాగమల్లి లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా భార్యాభర్తలు దేవుడు, పాపికొండలు పనిచేస్తున్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి పాపికొండలును హతమార్చాడు. ఘటనా స్థలంలో అనుమానితున్ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-15T13:33:01+05:30 IST