సుపారీ ఇచ్చి.. భర్త హతం

ABN , First Publish Date - 2020-11-29T05:58:10+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కిరాయి హంతకులతో చం పించిన భార్య ఉదంత మిది.

సుపారీ ఇచ్చి.. భర్త హతం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం        

బంగారం మెరుగుకు ఉపయోగించే పటాస్‌ రసాయనంతో హత్య


 గుంటూరు, నవంబరు 28: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కిరాయి హంతకులతో చం పించిన భార్య ఉదంత మిది. పెదకూరపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 75 - త్యాళ్ళూరులో ఈ నెల 4న రాత్రి జరిగిన హోటల్‌ వ్యాపారి భాష్యం బ్రహ్మయ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదిం చారు. ఈ హత్యలో హతుని భార్య సాయికుమారి(35), ఆమె ప్రియుడు మూడెల అశోక్‌ రెడ్డి(24)తో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కారు డ్రైవర్‌ పవన్‌కుమార్‌, తాపీ మేస్ర్తి షేక్‌ షరీఫ్‌ను అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో మరో నిందితుడైన 75 త్యాళ్ళూరుకు చెందిన కారు డ్రైవర్‌ భార్గవరెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ కేసు వివరాలు వెల్లడించారు. 75 త్యాళ్ళూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్యకు ధరణికోటకు చెందిన సాయికుమారికి సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా వారికి బీటెక్‌ చదివే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో హోటల్‌ నిర్వహించే బ్రహ్మయ్యకు తోడుగా భార్య సాయికుమారి కూడా పని చేస్తుంటుంది. అదే గ్రామానికి చెందిన మూడెల అశోక్‌రెడ్డి కూడా బ్రహ్మయ్య హోటల్‌ ఎదురుగా కూల్‌డ్రింక్‌ షాపు నిర్వహిస్తుంటాడు. ఆయనకు ఏడాది క్రితమే వివాహ మైంది. అయితే చాలా కాలం నుంచి అశోక్‌రెడ్డికి, సాయి కుమారికి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి పద్ధతి మానుకోవాలని భార్య సాయి కుమారిని భర్త మందలించాడు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఎలాగైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని అశోక్‌రెడ్డి, సాయికుమారి ఏడాది క్రితం నిర్ణయించుకున్నారు. అశోక్‌రెడ్డి తనకు పరిచయ మున్న గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ భరత్‌రెడ్డితో కలసి కిరాయి హంతకులను సంప్రదించాడు. భరత్‌రెడ్డికి పరిచయం ఉన్న కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కారు డ్రైవర్‌ పవన్‌కుమార్‌ను సంప్రదించగా, అతడు తన స్నేహితుడైన తాపీమేస్ర్తీ షరీఫ్‌ను కలుపుకున్నాడు. హత్యకు రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ మొత్తం సాయికుమారి ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా నిందితుల చేతికి ముందు రూ.40 వేలు, తరు వాత ఆన్‌లైన్‌ ద్వారా మరో రూ.40 వేలు ఇచ్చారు. ఇప్ప టికి మూడు సార్లు హత్యకు విఫలయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు బ్రహ్మయ్య ఏ సమయంలో ఎక్కడకు వెళతాడు, ఏసమయంలో ఒంటరిగా వెళతాడు అనే వివరాలను భార్య, అమె ప్రియుడు సహాయంతో తెలుసుకుని హత్యకు పథకం రూపొందించి అమలు చేశారు. బ్రహ్మయ్య రోజు మాదిరిగానే గత నెల 4న రాత్రి హోటల్‌లోని వ్యర్థాలను ఊరు చివర పడేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లగా అతడిని కింద పడేసి ముఖం పై పటాస్‌ కొట్టి పరారయ్యారు. ముఖం మంట పుడు తుండటంతో బ్రహ్మయ్య సమీపంలోని పరస గ్రామంలో గల బంధువుల ఇంటికి వెళ్ళి వారి సహాయంతో ఆసు పత్రికి వెళుతుండగా మృతి చెందాడు. అయితే తానేమీ ఎరగనట్లు నిందితురాలు సాయికుమారి ఆసుపత్రికి వచ్చింది. అయితే ఈ హత్యపై అప్పటికే గ్రామంలో ఆమె అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయం పోలీసుల దృష్టికి రాగా ఆమె కదలికలపై ఓ కన్నేసి ఉంచారు. నింది తులు మిగిలిన సుపారీ డబ్బుల కోసం సాయికుమారిని సంప్రదిస్తూనే ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేక పోయినా తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఆద్వర్యంలో పెదకూరపాడు సీఐ తిరుమలరావు, ఎస్‌ఐ పట్టాభిరామ్‌, సిబ్బంది చాకచక్యంగా నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్పీ తెలిపారు. కాగా ఆయా పోలీస్‌ అధికారులు, సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలి పారు. హత్యకు జిల్లాలో ఈ రసాయనాన్ని ఉపయోగిం చడం ఇదే మొదటిసారి. ఒంటిపై ఎక్కడైనా గాయాలు ఉంటే అక్కడ ఈ రసాయనం తగిలతే వెంటనే సైనెడ్‌ లాగా మారి చనిపోతారు. ఈ రసాయనం తగిలిన వారు వెంటనే చింతపండు తింటే ప్రాణాపాయం నుంచి బయటపడేఏ వీలుంటుందని అంటున్నారు. 


Updated Date - 2020-11-29T05:58:10+05:30 IST