నాడు - నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-07-31T05:33:04+05:30 IST

జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నాడు - నేడు పథకం ద్వారా అధునాతన భవనాలు, వైద్య పరికరాలు, మందులు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు.

నాడు - నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో పాల్గొన్న ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి

గుంటూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నాడు - నేడు పథకం ద్వారా అధునాతన భవనాలు, వైద్య పరికరాలు, మందులు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌తో కలిసి నాడు - నేడు పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా రెండు మెడికల్‌ కళాశాలలను కూడా మంజూరు చేసిందని, వాటి పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో తొలుత కలెక్టర్‌ జిల్లాలో చేపట్టిన పనుల వివరాలను నివేదించారు.  సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పి.ప్రశాంతి జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించి పవర్‌ పాయంట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జే యాస్మిన్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఏ శ్రీనివాసరావవు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ నథానియేల్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ మాధవి సుకన్య, భూగర్భ గనుల శాఖ ఏడీ విష్ణువర్థనరావు, కార్పొరేషన్‌ ఈఈ శాంతిరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T05:33:04+05:30 IST