మురబ్బా

ABN , First Publish Date - 2020-11-28T21:29:50+05:30 IST

ఉసిరికాయలు - వంద గ్రాములు, పంచదార - ఒకకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వేగించిన జీడిపప్పు - ఐదారు పలుకులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు

మురబ్బా

కావలసినవి: ఉసిరికాయలు - వంద గ్రాములు, పంచదార - ఒకకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వేగించిన జీడిపప్పు - ఐదారు పలుకులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు. 


తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను కట్‌ చేసి గింజలు తీసేసి పేస్టు చేసుకోవాలి. తరువాత నెయ్యిలో వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి, పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని పానకం దగ్గరకి అయ్యాక కార్న్‌ఫ్లోర్‌ వేయాలి. ఇప్పుడు నెయ్యిలో వేగించి పెట్టుకున్న ఉసిరికాయ పేస్టు వేసి కలపాలి. కొద్దిగా నెయ్యి వేసి మరికాసేపు వేగించుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-11-28T21:29:50+05:30 IST