Munugodu Bypoll: అమిత్‌షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-08-18T15:43:37+05:30 IST

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈనెల 21న జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Munugodu Bypoll: అమిత్‌షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టిసారించింది. ఈనెల 21న జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) సభను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్ షా (Union Home Minister) సభ కోసం వివేక్ వెంకటస్వామి (Vivek venkat swamy), మనోహర్ రెడ్డి (Manohar reddy), ప్రదీప్ రావు (Pradeep rao)తో కమిటీ ఏర్పాటు అయ్యింది. ప్రతి మండలానికి, మున్సిపాలిటీకి ఇద్దరు చెప్పున 18 మంది ఇన్‌చార్జ్‌లను నియమించారు. కేంద్ర హోంమంత్రి (Amith shah)కి ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు  ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సభలోనే అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరె (Komati reddy rajagopal reddy)  కాషాయ కండువా కప్పుకోనున్నారు. పాత కొత్త నేతలు సమన్వయంతో పనిచేస్తే లక్ష ఓట్లు కష్టం కాదని బీజేపీ భావిస్తోంది.


రాజగోపాలరెడ్డి చేరిక తర్వాత ఉప ఎన్నిక ప్రచార పర్వంలోకి తెలంగాణ బీజేపీ  (Telangana bjp)దిగనుంది. బైపోల్స్‌లో లక్ష ఓట్లు సాధించాలని కమలం పార్టీ  టార్గెట్ పెట్టుకుంది. బైపోల్స్ ప్రచారానికి కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నేతలు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 22 నుంచి  తెలంగాణ బీజేపీ  మునుగోడులో మకాం వేయనుంది. 21న అమిత్ షా సభ తర్వాత నాయకులంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. 2018 సాధారణ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కోమటిరెడ్డి  అభ్యర్థిత్వం తమకు అదనపు బలం అవుతోందని కమలం పార్టీ భావిస్తోంది. బహిరంగ సభ తర్వాత మునుగోడు బైపోల్స్ కోసం బీజేపీ ఎన్నికల కమిటీని వేయనుంది.

Updated Date - 2022-08-18T15:43:37+05:30 IST