Nalgonda: మునుగోడు ఉప ఎన్నికకు ఏంసీసీ నిబంధనలు

ABN , First Publish Date - 2022-10-07T20:37:35+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏంసీసీ నిబంధనలు అమలు చేస్తున్నట్లు...

Nalgonda: మునుగోడు ఉప ఎన్నికకు ఏంసీసీ నిబంధనలు

నల్గొండ (Nalgonda): మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By Election)ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏంసీసీ నిబంధనలు అమలు చేస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి (Vinay Krishna Reddy) తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ నియోజకవర్గం చుట్టూ 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, డబ్బు, మద్యం సరఫరా కాకుండా చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు చేస్తారన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు వచ్చిన కొత్త ఓటర్ల దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కును కల్పిస్తామన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు సంఖ్య ఎక్కువగా వచ్చిందన్నారు. అనర్హులను తొలగిస్తామని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన యాప్‌తో ఫిర్యాదులు స్వీకరించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తామని వినయ్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-10-07T20:37:35+05:30 IST