Munugode By-election: కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-27T01:12:53+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక (Munugode By-election)లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Munugode By-election: కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మర్రిగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక (Munugode By-election)లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వార్థం కోసం రాజీనామా చేయలేదని, అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని తెలిపారు. స్వార్థం కోసం, కాంట్రాక్ట్‌ల కోసం నమ్ముకున్న పార్టీని మోసం చేశానని టీఆర్‌ఎస్‌ (TRS) నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా బూటకమని అన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడం వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజీనామా చేసిన నాటి నుంచే మునుగోడు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి భూనిర్వాసితులకు భూపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వస్తున్నాయని తెలిపారు. మూడేళ్లుగా రిజర్వాయర్‌ ముంపు గ్రామాల బాధితులకు ఎందుకు భూపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ ద్వారానే మునుగోడు అభివృద్ధి చెందుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-27T01:12:53+05:30 IST