Munugode: మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ శ్రీకారం

ABN , First Publish Date - 2022-08-16T01:11:25+05:30 IST

మునుగోడు (Munugode) నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ స్థాయిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

Munugode: మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ శ్రీకారం

నల్లగొండ: మునుగోడు (Munugode) నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ స్థాయిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన వ్యూహ, ప్రచార కమిటీని నియమించారు. ఉపఎన్నిక ఇన్‌చార్జిగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యవహరిస్తారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు. వీటన్నిటికి తోడు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికంఠాగూర్‌ ఆధ్వర్యంలో కొనసాగే మండలాల వారీగా నాయకుల జాబితాను ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ ప్రకటించారు. చౌటుప్పల్‌ మండల బాధ్యతలు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా నాయకుడు నాయిని రాజేందర్‌రెడ్డిలకు, నారాయణపురం మండల బాధ్యతలు మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌, గండ్ర సత్యనారాయణలకు అప్పగించారు. మునుగోడు మండల ఇన్‌చార్జులుగా ఎమ్మెల్యే సీతక్క, విజయ రమణారావులను నియమించారు. నాంపల్లి మండలానికి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవిని కేటాయించారు. గట్టుప్పల్‌ మండల బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, ఆది శ్రీనివా్‌సలకు అప్పగించారు. చండూరు మండలానికి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, డాక్టర్‌ వంశీకృష్ణలకు, మర్రిగూడ మండల బాధ్యతను చెరుకు సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిలకు అప్పగించారు.

Updated Date - 2022-08-16T01:11:25+05:30 IST