Munugode: నేడు మునుగోడుపై కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

ABN , First Publish Date - 2022-08-11T13:14:33+05:30 IST

నేడు ఉదయం 10:30 గంటలకు మునుగోడుపై కాంగ్రెస్‌ (Congress) నేతల కీలక భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు

Munugode: నేడు మునుగోడుపై కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

హైదరాబాద్‌: నేడు ఉదయం 10:30 గంటలకు మునుగోడుపై కాంగ్రెస్‌ (Congress) నేతల కీలక భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వర్కింగ్‌ ప్రెసిడెంట్లతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అనుబంధ సంఘాల చైర్మన్లతో సమావేశంకానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election)కు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటించకపోయినా.. అనధికారికంగా సంకేతాలిచ్చాయి. అయితే ఇలా సంకేతాలు రావడంతోనే ఆశావహుల్లో అసంతృప్తి మొదలైంది. కాంగ్రెస్‌లో ఆర్థిక బలమే ప్రాతిపదికగా అభ్యర్థి ఎంపిక జరుగుతుందని స్పష్టమవుతోంది. టికెట్‌ కోసం పోటీపడుతున్న నేతల్లో ఆర్థికంగా అందరికంటే బలంగా ఉన్నది చల్లమల్ల కృష్ణారెడ్డే. ఇదొక్కటే ఆయన ఎంపికకు కారణం కాకపోయినా.. ఇదో అదనపు అర్హత కిందే పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ శిబిరంలో చేరిపోయిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పనిలో భాగంగా మండలాల వారీగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి భరోసా ఇస్తున్నారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 90 శాతం మంది నేతలు హాజరవుతున్నారు. వారికి భరోసా ఇచ్చి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బు అంశమే ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న ముగ్గురిని ఎంత త్వరగా ఒప్పించి అంత త్వరగా పనిలో పడాలని కాంగ్రెస్‌ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కృష్ణారెడ్డి పేరును ఖరారు చేయాలని అనుకున్నా మిగిలిన ఆశావహులు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న సమాచారంతో పీసీసీ నేతలు వేచి చూస్తున్నారు. ఒకేసారి అభ్యర్థి పేరు ప్రకటించకుండా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం నెలకొల్పి నెలాఖరుకు కృష్ణారెడ్డి పేరును ప్రకటించనున్నట్లు సమాచారం.

Updated Date - 2022-08-11T13:14:33+05:30 IST