Munugode by-election: మునుగోడు ఉపఎన్నిక కోసం స్పీడ్ పెంచిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-08-11T15:15:35+05:30 IST

మునుగోడు ఉపఎన్నిక (Munugode by-election) కోసం కాంగ్రెస్ (Congress) స్పీడ్ పెంచింది.

Munugode by-election: మునుగోడు ఉపఎన్నిక కోసం స్పీడ్ పెంచిన కాంగ్రెస్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక (Munugode by-election) కోసం కాంగ్రెస్ (Congress) స్పీడ్ పెంచింది. ఉపఎన్నికకు వ్యూహ రచన, అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ తయారు చేసింది. జాబితాలో పాల్వాయి స్రవంతి, సి.హెచ్.కృష్ణారెడ్డి, పల్లె రవి పేర్లు ఉన్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఆశావహుల బలాబలాలపై ఇప్పటికే సునీల్ కనుగోలు బృందం సర్వే చేసింది. అర్థరాత్రి వరకు ఓ హోటల్లో వ్యూహకర్త ఎస్‌కేతో తెలంగాణ ఇన్‌ఛార్జీ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), కాంగ్రెస్ నేతలు బోసు రాజు, జావేద్ చర్చలు జరిపారు. సర్వే రిపోర్ట్ను సునీల్ కనుగోలు నేతలకు వివరించారు. ఆ తర్వాత మాజీమంత్రి జానారెడ్డితో మాణిక్కం ఠాగూర్, బోసురాజు, జావేద్ భేటీ అవుతారు. సర్వే వివరాలు, మునుగోడు అభ్యర్థి ఎంపికపై జానారెడ్డితో చర్చలు జరుపుతారు. 


మునుగోడులో పార్టీ ఫిరాయించిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల స్థానంలో ముగ్గురు/అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను నియమించి ఉప ఎన్నిక కోసం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార వ్యూహ కమిటీ నిర్ణయించింది. రెండుమూడు రోజుల్లో ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల్లో పార్టీ సమన్వయ కమిటీలను ఖరారు చేయాలని తీర్మానించింది. మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఈ నెల 16 నుంచి రోజుకు రెండు మండలాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అప్పటి వరకు మునుగోడులో తామే పార్టీ అభ్యర్థులమంటూ ఎవ్వరూ ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని సమావేశం తీర్మానించింది. ఈ నెల 16-18 వరకు ప్రతి రోజు రెండు మండలాల నాయకులు, కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. మునుగోడులో ఎవరిని నిలబెడితే బాగుంటుందన్న అంశంపై లోతుగా అభిప్రాయ సేకరణ చేయనున్నారు. 

Updated Date - 2022-08-11T15:15:35+05:30 IST