చేర్యాలలో మున్సిఫ్‌ కోర్టు ఏర్పాటు పక్కా : న్యాయవాదులు

ABN , First Publish Date - 2022-05-23T04:40:21+05:30 IST

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవతో చేర్యాలలో మున్సిఫ్‌ కోర్టు పక్కాగా ఏర్పాటు కాబోతుందని చేర్యాల ప్రాంత న్యాయవాదులు అన్నారు.

చేర్యాలలో మున్సిఫ్‌ కోర్టు ఏర్పాటు పక్కా  : న్యాయవాదులు

చేర్యాల, మే 22: ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవతో చేర్యాలలో మున్సిఫ్‌ కోర్టు పక్కాగా ఏర్పాటు కాబోతుందని చేర్యాల ప్రాంత న్యాయవాదులు అన్నారు. చేర్యాల పట్టణంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాదులు ముస్త్యాల స్టీవెన్‌, ఆరెల్ల వీరమల్లయ్య, భూమిగారి మనోహర్‌ మాట్లాడారు. నూతన జిల్లా కేంద్రాల్లో కోర్టుల ఏర్పాటుకు ఇటీవల చర్యలు తీసుకున్నా ఆందోళనకు గురికావద్దని, సబ్‌ కోర్టుల విషయమై కసరత్తు పూర్తికాబోతున్నందున మరికొద్ది రోజుల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌, అల్లాదుర్గం, పటాన్‌చెరులతో పాటు చేర్యాలలో కొత్త కోర్టులు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ఈ విషయమై తాము కూడా హైకోర్టు అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురికావద్దని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు ఆరెల్ల మహేందర్‌, మేరుగు రమేష్‌, అంకని సురేందర్‌, పొన్నం సురేష్‌, గుస్క వెంకటేష్‌, నీరటి వెంకటేష్‌, నల్లగొండ సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:40:21+05:30 IST