56 నగర సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-11-19T18:34:24+05:30 IST

పాలనా సమయం ముగిసిన 56 నగర సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ అంశంపై స్వచ్ఛందంగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి అవస్థి నాయకత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి ఈ

56 నగర సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

బెంగళూరు: పాలనా సమయం ముగిసిన 56 నగర సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ అంశంపై స్వచ్ఛందంగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి అవస్థి నాయకత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నగర సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరుపు న్యాయవాదులు, ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను ధర్మాసనం ఆలకించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాలనాధికారుల పర్యవేక్షణలో ఉన్న 56 నగర సంస్థలలోనూ వార్డుల రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం ఈ నెల 26 లోపు ప్రకటించాల్సి ఉండగా అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్డ్‌ను 30లోపు ప్రకటిస్తుంది. కాగా 56 నగర సంస్థలకు గాను 10 నగర సంస్ధల రిజర్వేషన్ల జాబితాలను ఇప్పటికే ప్రకటించడం జరిగిందని మిగిలిన 46 సంస్థల డ్రాఫ్ట్స్‌ నోటిఫికేషన్‌ జారీ అయిందని ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు చెప్పారు. ఎన్నికలు జరుగాల్సి ఉన్న నగర, పురసభలు, పట్టణ పంచాయితీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 


నగర సభలు

గదగ, బెటగేరి, హొసపేట, హెబ్బగోడి 


పురసభలు

అథణి, అణ్ణేగేరి, బంకాపుర, జిగణి, చందాపుర, బిడది, మలె బెన్నూరు, కాపు, హారోగేరి, ముగళ ఖోడ, మునవళ్ళి, ఉగార ఖుర్దా, కారటగి, కురేకుప్ప, హగరి బొమ్మనహళ్ళి, కురగోడు, మస్కి, కెంభావి, కక్కేరా


పట్టణ పంచాయతీలు

నాయకనహట్టి, విట్లె, కోటెకారు, ఎంకె హుబ్బళ్ళి, కంకనవాడి, నాగనూర, యక్తాంబ, చెన్నమ్మ కిత్తూరు, అరభావి, ఖానాపుర, కేడబాళ, చించళి, బూరగావ, కల్లోళి, సాలకవాడ, నిడగుంది, దేవరహిప్పరగి, అలమేల, మనగోళి, కోల్హార, కమటగి, బెళగలి, అమీనగఢ, గుత్తల, జాలి, తావరగేరా, కుకనూర, భాగ్యనగర, కనకగిరి, మరియమ్మనహళ్ళి, కవితాళ, తురివిహాళ, బళగానూర, సిరివార. 

Updated Date - 2021-11-19T18:34:24+05:30 IST