Municipality, Corporation‌ ఎన్నికలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-11-22T17:08:33+05:30 IST

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపే నిమిత్తం ఈ నెలాఖరున నోటిఫికేషన్‌ జారీ కానుంది. ప్రస్తుతం పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన పనులు, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన పనులన్నీ ముగిశాయి.

Municipality, Corporation‌ ఎన్నికలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్‌

చెన్నై: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపే నిమిత్తం ఈ నెలాఖరున నోటిఫికేషన్‌ జారీ కానుంది. ప్రస్తుతం పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన పనులు, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన పనులన్నీ ముగిశాయి. వాస్తవానికి ఈ నెలారంభంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పళనికుమార్‌ భావించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడానికి వీలుగా ఆయన తగు చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికలను రెండు విడతలుగా జరుపనున్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ, కొత్తగా స్థాయి పెరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించబోమని ఆయన పేర్కొన్నారు. చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా 15 పాత కార్పొరేషన్లతోపాటు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుపుతామన్నారు. ఈ ఎన్నికలకు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార డీఎంకే పార్టీ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణను కూడా ప్రారంభించింది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కూడా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి సిద్ధమవుతోంది.

Updated Date - 2021-11-22T17:08:33+05:30 IST