ప్రగతి.. మున్సిపల్టీ

ABN , First Publish Date - 2021-08-28T04:56:15+05:30 IST

గుంటూరు కార్పొ రేషన్‌ సహా జిల్లాలోని పురపాలక సంఘాలలో వివిఽ ద పథకాల కింద 5,278 ప్రగతి పనులు చేపట్టేం దుకు రూ.1,358 కోట్లు మంజూరయ్యాయి.

ప్రగతి.. మున్సిపల్టీ
నరసరావుపేటలో నిచిపోయిన ముస్లిం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం

పురాల్లో నత్తనడకన పనులు

నిధుల కొరతతో సాగని అభివృద్ధి

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

రూ.1,358 కోట్ల పనులకు 12.64 శాతమే పూర్తి

 


పురపాలక సంఘాల్లో ప్రగతి పనులు..     నత్తనడకన సాగుతున్నాయి. నిధుల కొరత.. మంజూరైన వాటికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం తో ఎక్కడికక్కడ పనులు నిలిచి పోయాయి. అసంపూర్తి పనులతో ప్రజలు అల్లాడుతున్నా అధికారులు కాని, పాలకులు కాని పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గుం టూరు కార్పొరేషన్‌ సహా జిల్లాలోని మునిసి పాల్టీలలో వివిధ పథకాల కింద, సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తాండ విస్తున్నది. అభి వృద్ధి పనులు పూర్తి చేయడంలో మాచర్ల, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, పొన్నూరు ముని సిపాల్టీలు జిల్లాలో చివరి స్థానంలో ఉన్నాయి.


నరసరావుపేట, ఆగస్టు 27: గుంటూరు కార్పొ రేషన్‌ సహా జిల్లాలోని పురపాలక సంఘాలలో వివిఽ ద పథకాల కింద 5,278 ప్రగతి పనులు చేపట్టేం దుకు రూ.1,358 కోట్లు మంజూరయ్యాయి. చేపట్టిన పనుల్లో కేవలం 12.64 శాతం పనులు మాత్రమే  పూర్తయినట్టు మునిసిపల్‌ పరిపాలనావిభాగం లె క్కలు తెలియజేస్తున్నాయి. అమృత్‌, 14 ఆర్థిక సం ఘం, మునిసిపల్‌ సాధారణ, ఎస్‌సీఎస్పీ, ఎస్‌ఎఫ్‌సీ, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, టీఎస్‌పీ, నాన్‌ ప్లాన్‌ గ్రాంట్‌ తదితర పథకాల కింద పనులు మం జూరయ్యాయి. మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి, నీటి సర ఫరా, రోడ్లు, పార్కులు, మురుగు కాలువలు, భవనా లు తదితర ప్రగతి పనులు చేపట్టేందుకు అంచనా లు రూపొందించారు. వీటిలో మొత్తం పనులు 5,278 ఉండగా 661 పనులకు ఇంకా టెండర్లు కూడా నిర్వహించలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తయి నా రూ.344 కోట్ల విలువైన 1,912 ప్రగతి పనులను నేటికి ప్రారంభించలేదు.  రూ.729 కోట్ల విలువైన 1102 పనులు జరు గుతుండగా వీటిలో 53.89 శా తం పనులు పూర్తయినట్టు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. రూ.75 కోట్ల విలువైన 1152 పనులు పూర్తయినట్టు మునిసిపాల్టీ ప్రగతి నివేదికలు తెలియజేస్తున్నాయి. మొత్తం 5,278 పనుల్లో భవనాలకు సంబంధించిన పనులు 460 ఉన్నాయి. మురుగు కాలువల్లో పూడికతీత పనులు 292, పార్కులు అభివృద్ధి పనులు 85, రహదారుల నిర్మాణం 2,087, రహదారులు, మురుగుకాలువలు రెండూ కలిసి ఉన్న పనులు 716, వీధి దీపాలకు సంబంధించినవి 77, మురుగునీటి వ్వవస్థ అభివృద్ధి పనులు 26, సాలీడ్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ 457, తాగు నీటి సరఫరా పనులు 606 ఉన్నాయి. రహదారుల పనులు 623 పూర్తయ్యాయి. మురుగుకాలువల్లో పూడిక తీత పనులు 292 కాగా వీటిలో కేవలం 45 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాకాలంలో ఈ పనులు అత్యవసరం కాగా వీటిని పూర్తి చేయడం లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఆయా ప్రాంతా లలో నివసించే ప్రజలు ఆందోళనకు గురవుతున్నా రు. గుంటూరు కార్పొరేషన్‌లో 1,680 పనులు చేప ట్టగా 42.95 శాతం పనులు పూర్తయ్యాయి. సత్తెన పల్లి మునిసి పాల్టీలో చేపట్టిన 128 పనుల్లో 47.28 శాతం పనులు పూర్తి కాగా జిల్లాలో ప్రథమ స్థానం లో ఉంది. నరసరావుపేట మునిసిపాల్టీలో 42.78 శాతం, వినుకొండలో 37.03 శాతం, రేపల్లేలో 35.61 శాతం, బాపట్లలో 34.85శాతం,మంగళగిరిలో 28.73 శాతం, తాడేపల్లిలో 16.35 శాతం, తెనాలిలో 10.91 శాతం పనులు పూర్తైనట్లు ఆయా మున్సిపాల్టీల లెక్కలు తెలియజేస్తున్నాయి. పలు పట్టణాల్లో ప్రధా నంగా మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం చేప ట్టిన పనులు పూర్తికాక పోతుండటంతో ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కూడా పనులు నిలిచిపోతున్నాయి. నిధులు ఉండి కూడా నిలిచిపో యిన పనులను త్వరతిగతిన పూర్తి చేసేందుకు పుర పాలకులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-28T04:56:15+05:30 IST