Vijayawada: ఐదో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-07-15T17:40:05+05:30 IST

ఏపీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది.

Vijayawada: ఐదో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె

విజయవాడ (Vijayawada): తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీలో మున్సిపల్ కార్మికులు (Municipal Workers) చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా విజయవాడలోని మున్సిపల్ వర్కర్ల జేఏసీ కన్వీనర్ ఉమామహేశ్వరరావు (Umamaheswara Rao) మీడియాతో మాట్లాడుతూ చర్చల్లో మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh)కు  తమ డిమాండ్‌లు చెప్పామన్నారు. 33వేల మంది కార్మికుల సమస్యపై స్పందించాలని కోరామన్నారు. ఆనాడు రూ. 18వేలే  సిఎం ఇవ్వమన్నారని చెప్పారు.. ఇప్పుడు మంత్రి సురేష్ రూ. 21వేలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇటు వంటి నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రభుత్వం తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కార్మికులు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారని,  సోమవారం నాటికి ప్రభుత్వం రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వాలన్నారు... లేకుంటే మరోసారి సమ్మెకు దిగాల్సి వస్తుందని ఉమామహేశ్వరరావు అన్నారు.


జేఏసీ నేత సుబ్బరాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను కాలరాసే విధంగా పని చేస్తుందని, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 21వేల వేతనం ఒక్కటే అమలు చేసి చేతులు దులుపుకున్నారని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మినిట్స్‌ను బహిర్గతం చేయాలన్నారు. చర్చల్లో మంత్రులు చెప్పిన విధంగా 21 హామీలు  ప్రభుత్వం అమలు చేయాలని, లేనిపక్షంలో మళ్లీ సమ్మెకు దిగడం ఖాయమని సుబ్బరాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-15T17:40:05+05:30 IST