AP: రెండో రోజు కొనసాగుతున్న మున్సిపల్ Workers strike

ABN , First Publish Date - 2022-07-12T22:39:11+05:30 IST

ఏపీలోని మున్సిపల్ కార్మికుల సమ్మె రెండో రోజు మంగళవారం కొనసాగుతోంది.

AP: రెండో రోజు కొనసాగుతున్న మున్సిపల్ Workers strike

గుంటూరు (Guntur): తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ (AP) లోని మున్సిపల్ కార్మికులు (Municipal workers) రెండో రోజు మంగళవారం సమ్మె (strike) కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కార్మకులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) తక్షణమే అమలు చేయాలంటూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. నిన్న మున్సిపల్ శాఖ మంత్రితో జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు.


గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్బంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిన్న చర్చల్లో తమ సమస్యలను వివరిస్తే.. చూస్తాం, చేస్తాం, సమ్మె విరమించాలని బెదిరింపు ధోరణికి దిగారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని అన్నారు. పర్మినెంట్ చేస్తామన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వమని కార్మికులు విమర్శించారు. గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నపథకాల్లో ఏ ఒక్కటీ మున్సిపల్ కార్మికులకు అందడంలేదని చెప్పారు.

Updated Date - 2022-07-12T22:39:11+05:30 IST