మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

ABN , First Publish Date - 2022-01-22T05:24:34+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

కడప(రవీంద్రనగర్‌), జనవరి 21: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరి కేసీ బాదుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీని విడుదల చేయాలని, మున్సిపల్‌ ఒప్పంద పారిశుధ్య ఇంజనీరింగ్‌ స్కూల్‌ స్వీపర్లను పర్మినెంట్‌ చేయాలని, సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ కార్మికుల బెనిఫిట్స్‌ విడుదల చేయాలని, కొవిడ్‌ వల్ల మరణించిన కార్మికులకు రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. వెంటనే మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ఆయుబ్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి మద్దిలేటి, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్ష కార్యదర్శి నరసింహ, తారకరామారావు, వెంకటాద్రి, చంద్ర, జనార్థన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:24:34+05:30 IST