రీనామినేషన్లపై స్టే

ABN , First Publish Date - 2021-03-04T08:27:08+05:30 IST

పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు

రీనామినేషన్లపై స్టే

ఎన్నికల అక్రమాలపై ట్రైబ్యునల్‌కే వెళ్లాలి

ఎలక్షన్‌ పిటిషన్‌ మాత్రమే వేసుకోవాలి

ఎస్‌ఈసీ నిర్ణయం ప్రశంసనీయమే

కానీ, చట్టం పిటిషనర్లకు అనుకూలం: హైకోర్టు 

ఎస్‌ఈసీ ఉత్తర్వుల అమలు నిలిపివేత

అడ్డగింతపై ఫిర్యాదుల ఆదేశాలూ సస్పెండ్‌


అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. అంతేగాక.. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణల విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ గత నెల 16న ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కూడా సస్పెండ్‌ చేసిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీవీఎస్‌ సోమయాజులు బుధవారం తీర్పు ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థులు ఎన్నికల ట్రైబ్యునల్‌ను మాత్రమే ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు, వంచన చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలన్నారు. గత ఏడాది మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో 14 డివిజన్లు, వార్డుల్లో రీనామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 1న ఎస్‌ఈసీ ఉత్తర్వులివ్వడం, వీటిని సవాల్‌ చేస్తూ చేసూ ్తతిరుపతి నగరపాలక సంస్థ డివిజన్లు, కడప జిల్లా రాయచోటి పురపాలక సంఘం వార్డులో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై మంగళవారం వాదనలు ముగిశాయి.


న్యాయమూర్తి బుధవారం తీర్పు ప్రకటించారు. ‘నామినేషన్ల దాఖలు దశ నుండి ఫలితాలు ప్రకటించే వరకు వచ్చే ఫిర్యాదులను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు, వంచన చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలి. ఈ నేపథ్యంలో రీనామినేషన్‌ వేసేందుకు ఎస్‌ఈసీ ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమే అయినా.. చట్టం పిటిషనర్లకు అనుకూలంగా ఉంది. ఎస్‌ఈసీ చర్యలు సమాజహితం కోసమే అయినప్పటికీ చట్ట నిబంధనల నేపథ్యంలో దాని ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నాం’ అని  పేర్కొన్నారు. 


ఎన్నికల పిటిషన్‌ ద్వారానే ప్రశ్నించాలి..

మోసపూరితంగా నామినేషన్లను అడ్డుకున్నా, ఓటర్లను ప్రభావితం చేసినా హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలోని సెక్షన్‌-71 ప్రకారం ఎన్నికల పిటిషన్‌ ద్వార ానే ప్రశ్నించాలని న్యాయమూర్తి తెలిపారు. మున్సిపల్‌ చట్టంలోని 65(1) నిబంధన కూడా ఇదే విషయం చెబుతోందన్నారు. ‘నిష్పాక్షిక ఎన్నికల నిర్వహించడం ప్రజాస్వామ్య దేశం ప్రధాన ఉద్దేశం. ఆ లక్ష్యాలను సాధించేందుకు నియమ నిబంధనలు రూపొందించడంతోపాటు ఎస్‌ఈసీకి విస్తృత అధికారాలు కల్పించారు. పరిస్థితుల ఆధారంగా ఎస్‌ఈసీ నిర్ణయాలు తీసుకుంటుంది. చట్ట నిబంధనలల్లో నిర్దిష్టంగా పేర్కొనని అంశాల్లో మాత్రమే దానికి విస్తృ త అధికారాలు ఉంటాయి. భారీ స్థాయిలో బెదిరింపులు, అడ్డంకులు కలిగించారని ఎస్‌ఈసీ చెబుతున్నప్పటికీ.. నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రీనామినేషన్లు వేసేందుకు ఎందుకు అవకాశం కల్పించారో ఆ ఉత్తర్వుల్లో కారణాలు కనపడడం లేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-04T08:27:08+05:30 IST