అప్రజాస్వామిక స్థితిలో పురపాలక ఎన్నికలు

ABN , First Publish Date - 2021-03-03T04:46:56+05:30 IST

అప్రజాస్వామిక స్థితిలో పురపాలక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయని రాయచోటి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

అప్రజాస్వామిక స్థితిలో పురపాలక ఎన్నికలు

మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి

రాయచోటి, మార్చి 2 : అప్రజాస్వామిక స్థితిలో పురపాలక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయని రాయచోటి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాయచోటి పట్టణంలో జరుగుతున్న పురపాలక సం ఘం ఎన్నికల్లో 20, 31 వార్డులకు నామినేషన్లు వేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో మంగళవారం 20వ వార్డుకు టీడీపీ నుంచి కౌన్సిలర్‌ అభ్యర్ధిగా కొట్టే వెంకటచలపతి చేత రమేష్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయించారు. అనంతరం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రా యచోటి మునిసిపాలిటీలోని 34 వార్డులుండగా.. కేవలం 5 లేదా 6 వార్డులకు కంటితుడుపు చర్యగా ఎన్నికలు జరపడం బాధాకరమన్నారు. దాదాపు 20 నామినేషన్‌లను ఏకపక్షంగా తిరస్కరిస్తే.. కేవలం ఇద్దరికి మాత్రమే నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం కల్పించడం కంటితుడపు  చర్య అన్నారు. కార్యక్రమంలో తెలుగుదే శం పార్టీ నాయకులు గాజుల ఽఖాదర్‌బాష, బోనమల ఖాదర్‌వలి, అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-03T04:46:56+05:30 IST