13న నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశం

ABN , First Publish Date - 2020-08-11T10:24:32+05:30 IST

నగరపాలక సంస్థ సమా వేశమందిరంలో ఈనెల 13న ప్రత్యేక సర్వసభ్య సమావేశా న్ని ఏర్పాటు చేశారు

13న నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశం

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక..


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 10: నగరపాలక సంస్థ సమా వేశమందిరంలో ఈనెల 13న ప్రత్యేక సర్వసభ్య సమావేశా న్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు కమిషనర్‌ వల్లూరి క్రాంతి, మేయర్‌ వై సునీల్‌రావు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకైక అం శంగా ఎజెండాను రూపొందించారు. కార్పొరేషన్‌లోని ఐదు కోఆప్షన్‌ పదవులకు 20 మంది దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించిన అధికారులు అవన్నీ కూడా సరిగానే ఉన్నట్లు ప్రకటించారు. దీనితో దరఖాస్తు చేసుకున్న వారంతా ఎవరి కి వారుగా కోఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నా లు ముమ్మరం చేశారు.


ఉదయం 10గంటలకు ముందుగా అనుభవజ్ఞుల కోటాలో ముగ్గురిని, ఆ తర్వాత మైనార్టీ కోటా లో ఇద్దరిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకునే విధంగా ఏర్పా ట్లు చేశారు. కార్పొరేషన్‌లోని 60మంది కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు చేతులు పైకెత్తి ఐదుగురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ సమావేశానికి ఎక్స్‌ అఫీషి యో సభ్యుడిగా మంత్రి గంగుల కమలాకర్‌ కూడా హాజర వుతారని సమా చారం. కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌కు 1మంది, దాని మిత్రపక్షమైన ఎంఐఎంకు ఐదుగురు సభ్యులుండడం తో వారికే కోఆప్షన్‌ పదవులు దక్కడం ఖాయం.


దీనితో నాలుగు పదవులను టీఆర్‌ఎస్‌, మైనార్టీలోని ఒక పదవిని ఎంఐఎంకు కేటాయించి ఆ పార్టీలు ఒక ఒప్పందం చేసుకోవడంతోపాటు కోఆప్షన్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రి య పూర్తిచేసినట్లు తెలిసింది. అయితే 14మంది సభ్యులు కలిగిన బీజేపీ కార్పొ రేటర్లు ఈ ఎన్నికలకు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో వారు ఈ  సమా వేశానికి హాజరవుతారో లేక గైర్హాజరవుతారో చెప్పలేమని, ఒకవేళ హాజరైనా ఓటింగ్‌లో పాల్గొనక తటస్థంగా ఉంటారో తెలియదని ఆపార్టీ నాయకులు చెబుతు న్నారు.

Updated Date - 2020-08-11T10:24:32+05:30 IST