పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2020-10-24T11:23:38+05:30 IST

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్కొన్నారు. శుక్రవారం గాంధీరోడ్డులో జరుగుతున్న డివైడర్‌ పనులను ఆమె పరిశీలించారు.

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ప్రొద్దుటూరు, అక్టోబరు 23 : పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్కొన్నారు. శుక్రవారం గాంధీరోడ్డులో జరుగుతున్న డివైడర్‌ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీరోడ్డులో 981 మీటర్లు డివైడర్‌ ఏర్పాటు చేసి గ్రీనరీ అభివృద్ధికి జనరల్‌ ఫండ్స్‌ నుంచి రూ.64లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు.


ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆస్పత్రులు, బ్యాంకులు, దుకాణాలు ఉండటంతో ఎక్కడెక్కడ యూటర్న్‌ ఏర్పాటు చేయాలి, జనం మాత్రమే దాటుకునేందుకు ఎక్కడెక్కడ దారి వదిలిపెట్టాలనే దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. గాంధీరోడ్డులో చాలా వరకు దు కాణదారులు రోడ్డును అక్రమించారని వారందరితో ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేసి, స్వ చ్చందంగా అక్రమణలు తొలగించాలని సూచించామన్నారు. శనివారం అక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గాంధీరోడ్డులో ఇక ట్రాఫిక్‌ సమస్య ఉం డబోదన్నారు. ఇదే కాకుండా జిన్నారోడ్డు, బొల్లవరంలో కూడా గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. రూ.155 కోట్లతో స్టామ్‌ వాటర్‌కు ప్రణాళికలు రూపొందించామన్నారు. 5 ప్రధాన కాలువలను అధునీకీకరణ చేయనున్నట్లు చె ప్పారు. ప్రజలు ఎవరైనా వారి వారి ప్రాంతా ల్లో రోడ్లు అవసరమైతే తమ దృష్టికి తేవాలన్నారు. వైసీపీ నేత బంగారురెడ్డి మాట్లాడుతూ రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.  కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ సీఐ క్రిష్ణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:23:38+05:30 IST