Abn logo
Mar 7 2021 @ 23:37PM

నేటితో ‘పురపోరు’ ప్రచారం పూర్తి

తుని, మార్చి 7: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తుని మున్సిపాల్టీలో 30వార్డులకుగాను ఇప్పటికే 15వార్డులు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయితే టీడీపీ పోటీ ఇచ్చిన మరో 15వార్డుల్లో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. సోమవారం ప్రచారానికి తెరపడనుండడంతో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్య ర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రచారం సమయం ముగిసిన తరువాత ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
Advertisement