Abn logo
Sep 28 2021 @ 22:54PM

ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి

మాట్లాడుతున్న కమీషనర్‌ ఎం రమేష్‌బాబు

ఆత్మకూరు, సెప్టెంబరు 28 : మున్సిపాల్టీ పరిధిలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.వెంకటరమణమ్మ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు రుణాల మంజూరు వేగవంతం చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని మెప్మా సిబ్బందికి సూచించారు. కమిషనర్‌ ఎం.రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి రూ.1.80 లక్షలు ఉచితంగా ఇస్తుందన్నారు. ఆర్థిక స్థోమత లేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోతున్న లబ్ధిదారులకు మెప్మా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైౖర్మన్‌ షేక్‌ సర్ధార్‌, మెప్మా సీఎంఎం కె.భాస్కర్‌, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఆర్పీలు పాల్గొన్నారు.