కావలసినవి: మునగకాయలు - ఆరు, శనగపప్పు - ఒక కప్పు, పచ్చిమిర్చి - మూడు, ఉల్లిపాయలు - ఎనిమిది, కొబ్బరినూనె - ఒక టేబుల్‌స్పూన్, కరివేపాకు - కొద్దిగా, పసుపు - అర టీస్పూన్, ఆవాలు - ఆర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, కొబ్బరితురుము - అరకప్పు.
తయారీ విధానం: శనగపప్పును శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి.మునగకాయలను కట్ చేసి పొట్టు తీయాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉప్పు వేసి వాటిని ఉడికించాలి. పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్టును ఉడికించిన మునగకాయల్లో కలపాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొబ్బరినూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత మునగకాయలు, ఉడికించిన శనగపప్పు కలపాలి. కాసేపు ఉడికించి దింపుకోవాలి. కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.