Abn logo
Oct 28 2020 @ 19:13PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

Kaakateeya

అబుధాబి: ఐపీఎల్-2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అబుధాబీ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌తో ప్లే ఆఫ్‌కు చేరే తొలి జట్టు ఏదో తెలిసిపోతుంది. అయితే రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌కు కూడా కీరన్ పొలార్డ్ కెప్టెన్సీ వహించనున్నాడు. బెంళూరులో మొత్తం మూడు మార్పులు జరిగాయి. గాయం కారణంగా సైనీ దూరం కాగా, ఫించ్, మొయీన్ అలీలను జట్టు నుంచి తప్పించారు. వారి స్థానంలో దూబే, ఫిలిప్, స్టెయిన్‌లును జట్టులోకి తీసుకున్నారు. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. టాస్‌పై కోహ్లీ మాట్లాడుతూ, తాను టాస్ గెలిచి ఉన్నా బ్యాటింగే ఎంచుకునే వాడినని చెప్పాడు.

Advertisement
Advertisement