Mumbai: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తల్లి.. 20ఏళ్ల తర్వాత ఆచూకీ లభ్యం.. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు!

ABN , First Publish Date - 2022-08-04T01:47:58+05:30 IST

ఆమె కుటుంబ బాధ్యతల కోసం ఉపాధిని వెతుక్కుంటూ రెండుమూడేళ్లకోసారి ఎడారి దేశాలకు వెళ్లి తిరిగొచ్చేది. ఈ క్రమంలోనే 2002లో ఆమె దుబాయ్ వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళ ఎన్ని రోజులైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి కోసం ఆమె పిల్లలు ఎంతో ప్రయత్నించారు. ఎన్నోచోట్ల వెతికారు. చివరికి తమ తల్లిని దుబాయ్‌ పంపిన ఏజెంట్‌నూ సంప్రదించారు. అయినా వాళ్లకు నిరా

Mumbai: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తల్లి.. 20ఏళ్ల తర్వాత ఆచూకీ లభ్యం.. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు!

ఎన్నారై డెస్క్: ఆమె కుటుంబ బాధ్యతల కోసం ఉపాధిని వెతుక్కుంటూ రెండుమూడేళ్లకోసారి ఎడారి దేశాలకు వెళ్లి తిరిగొచ్చేది. ఈ క్రమంలోనే 2002లో ఆమె దుబాయ్ వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళ ఎన్ని రోజులైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి కోసం ఆమె పిల్లలు ఎంతో ప్రయత్నించారు. ఎన్నోచోట్ల వెతికారు. చివరికి తమ తల్లిని దుబాయ్‌ పంపిన ఏజెంట్‌నూ సంప్రదించారు. అయినా వాళ్లకు నిరాశే ఎదురైంది. అలా ఆ పిల్లలు అమ్మకు దూరమై 20 ఏళ్లు గడిచిపోయాయి. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని తాజాగా వారికి తల్లి ఆచూకీ దొరికింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ముంబైకి చెందిన హమీదా బాను‌కు నలుగురు పిల్లలు(ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు). కుటుంబాన్ని పోషించడం కోసం ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి ఆమె ఖతర్ వెళ్లి అక్కడ పని చేసి ఇంటికొచ్చేది. ఈ క్రమంలోనే 2002లో ఏజెంట్‌ సాయంతో దుబాయ్ వెళ్లిన ఆమె.. రోజులు గడిచినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె పిల్లలు కంగారుపడ్డారు. తల్లి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి తమ తల్లిని దుబాయ్ పంపిన ఏజెంట్‌ను కూడా సంప్రదించారు. అయినా వారికి నిరాశే ఎదురైంది. ఇక తల్లి తిరిగొస్తుందనే ఆశలు వదులుకుంటున్న తరుణంలో సోషల్ మీడియా పుణ్యమా అని వారికి తమ అమ్మ ఆచూకీ దొరికింది. పాకిస్థాన్‌కు చెందిన వలీవుల్లా మసూద్.. రికార్డు చేసిన తమ తల్లి వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమెతో వీడియో కాల్ మాట్లాడి.. సంతోషం వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా హమీదా బాను కూతురు.. యాస్మిన్ మాట్లాడారు. ట్రావెల్ ఏజెంట్ తన తల్లిని మోసం చేశాడని.. దీంతో ఆమె పాకిస్థాన్ చేరుకుని అక్కడ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. తన తల్లిని వివాహం చేసుకున్న కొన్ని రోజులకు సదరు వ్యక్తి మరణించడంతో.. అక్కడ బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతుందని తెలిపారు. ఆమె పరిస్థిని చూసి వలీవుల్లా మసూద్.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. కొందరు సోషల్ యాక్టివిస్ట్‌ల ద్వారా ఆ వీడియో తమకు చేరిందని.. అనంతరం తమ తల్లితో వీడియో కాల్ మాట్లాడినట్టు చెప్పారు. అంతేకాకుండా తమ తల్లిని పాకిస్థాన్ నుంచి ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.


Updated Date - 2022-08-04T01:47:58+05:30 IST