Abn logo
Nov 30 2020 @ 07:03AM

టీవీ నటిపై కాస్టింగ్ డైరెక్టరు అఘాయిత్యం

ముంబై (మహారాష్ట్ర): తనపై కాస్టింగ్ డైరెక్టరు అత్యాచారం చేశాడని ప్రముఖ టీవీ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కాస్టింగ్ డైరెక్టరు ఆయుష్ తివారీ పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని టీవీ నటి ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ నటి ఫిర్యాదు పై తాము ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెర్సోవా పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు సాగిస్తున్నామని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement