Mumbai Rains: పలు బస్సు సర్వీసులు, రైళ్ల రాకపోకల రద్దు

ABN , First Publish Date - 2021-07-16T18:05:54+05:30 IST

ముంబై మహానగరంతోపాటు పలు శివారు ప్రాంతాలు వరదనీటిలో మరోసారి మునిగిపోయాయి....

Mumbai Rains: పలు బస్సు సర్వీసులు, రైళ్ల రాకపోకల రద్దు

ముంబై (మహారాష్ట్ర): ముంబై మహానగరంతోపాటు పలు శివారు ప్రాంతాలు వరదనీటిలో మరోసారి మునిగిపోయాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో ముంబైలోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. శుక్రవారం ఉదయం కూడా భారీవర్షం కురవడంతో పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. దీంతో ముంబై అర్బన్, సబర్బన్ ప్రాంతాల్లో శుక్రవారం పలు బస్సు సర్వీసులు, లోకల్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. భారీవర్షాల వల్ల మిథి నది నీటిమట్టం పెరగడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.ముంబైతో పాటు గుజరాత్, కొంకణ్,గోవా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీవర్షాలు కురిశాయి.


 ముంబైలో 25 సెంటీమీటర్లు, రత్నగిరిలో 22, మంగళూరులో 15, కొచ్చిన్ లో 9, కార్వార్ లో 8, ముర్మాగావ్, హోనవర్, కన్నూర్,త్రిస్సూర్, కొట్టాయంలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.ముంబై, నవీముంబై, రాయ్ గఢ్ ప్రాంతాల్లో భారీవర్షాలతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.కుర్లా-విద్యావిహార్ వద్ద భారీవర్షం వల్ల నీరు చేరడంతో రైళ్ల రాకపోకలను దారి మళ్లించారు. కుర్లా, సియోన్ ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల బస్సుల రాకపోకలను మళ్లించారు.


Updated Date - 2021-07-16T18:05:54+05:30 IST