Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 18 2021 @ 11:47AM

Mumbai Rains: 23 మంది మృతి!

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెంబూర్‌లో భారీ వర్షాల కారణంగా గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. ఇదే విధంగా విక్రోలిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. భారీ వర్షాల కారణంగా ముంబైలో మరణించినవారి సంఖ్య మొత్తంగా 23కు చేరింది. ప్రమాదాలు చోటుచేసుకున్న స్థలాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

చెంబూర్‌లోని వాషానాకా ప్రాంతంలో గోడ కూలిన ఘటన ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ శిధిలాలల్లో పలువురు చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. అలాగే విక్రోలీలో తెల్లవారుజామున ఒక గోడ కూలిపోగా, ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ముంబైలో కొన్ని గంటలపాటు ఆగకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంబైలోని చాలా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Advertisement
Advertisement