Mumbai: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఎస్పీ ఎమ్మెల్యేపై కేసు

ABN , First Publish Date - 2021-08-09T13:07:47+05:30 IST

పుట్టినరోజు జరుపుకోవడానికి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేపై ముంబై పోలీసులు కేసు...

Mumbai: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఎస్పీ ఎమ్మెల్యేపై కేసు

ముంబై (మహారాష్ట్ర): పుట్టినరోజు జరుపుకోవడానికి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ 66 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం కొవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. దీంతో ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈయన మహారాష్ట్ర అసెంబ్లీలో మంఖుర్ద్ శివాజీ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే అజ్మీ తన మద్ధతుదారులతో కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు గోవాండిలోని శివాజీనగర్ ప్రాంతంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.


ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు సామాజిక దూరం నిబంధనను పాటించలేదు. కనీసం మాస్కులు కూడా ధరించలేదు.అబూఅజ్మీ కర్ఫ్యూ ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా గుర్రపు బగ్గీపై నిలబడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కత్తిని ఝళిపించారు. కత్తిని ఝళపించి నిషేధాన్ని ఉల్లంఘించినందున ఎమ్మెల్యే అజ్మీపై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు చెప్పారు.అజ్మీ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.ఎమ్మెల్యే అజ్మీతోపాటు మరో 17మంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు  వివరించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 6,061 కరోనా కేసులు నమోదు కాగా ఇందులో 45 మందికి డెల్టా వేరియంట్ వైరస్ కేసులున్నాయి. 


Updated Date - 2021-08-09T13:07:47+05:30 IST