ముంబై పోలీసులపై `పుష్ప` ఎఫెక్ట్.. `శ్రీ వల్లీ` సాంగ్‌తో తమలోని స్పెషల్ ట్యాలెంట్ బయటపెట్టిన ఖాకీలు!

ABN , First Publish Date - 2022-03-15T20:28:38+05:30 IST

`పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్` అంటూ అల్లు అర్జున్ చేసిన మాస్ యాక్షన్ దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసింది.

ముంబై పోలీసులపై `పుష్ప` ఎఫెక్ట్.. `శ్రీ వల్లీ` సాంగ్‌తో తమలోని స్పెషల్ ట్యాలెంట్ బయటపెట్టిన ఖాకీలు!

`పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్` అంటూ అల్లు అర్జున్ చేసిన మాస్ యాక్షన్ దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసింది. ఆ సినిమాలోని డైలాగులు, పాటలు హిందీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ముఖ్యంగా `శ్రీ వల్లి` సాంగ్ ఎంతో మందిని ఆకట్టుకుంది. సామాన్యులే కాదు.. ముంబై పోలీసులు కూడా ఆ పాటకు ఫిదా అయిపోయారు. 


ఆ పాటతో తమలోని స్పెషల్ ట్యాలెంట్‌ను బయటకు తీశారు. కొద్దిసేపు తమ బాధ్యతలను పక్కన పెట్టి సంగీతకారులుగా మారిపోయారు. తుపాకులు పట్టుకునే చేతులతోనే సంగీత పరికరాలు పట్టుకుని `శ్రీ వల్లి` సాంగ్‌ను వాయించారు. ఈ వీడియోను ముంబై పోలీసులు యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.   



Updated Date - 2022-03-15T20:28:38+05:30 IST