ముంబై పోలీసులు విభిన్నంగా..

ABN , First Publish Date - 2020-07-08T08:11:02+05:30 IST

మహేంద్రసింగ్‌ ధోనీ(ఎంఎస్‌డీ)కి ముంబై పోలీసులు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్‌ మైదానం, దాని మధ్యలో...

ముంబై పోలీసులు విభిన్నంగా..

మహేంద్రసింగ్‌ ధోనీ(ఎంఎస్‌డీ)కి ముంబై పోలీసులు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్‌ మైదానం, దాని మధ్యలో వికెట్లు, బ్యాటు, బంతి.. వాటితో పాటు ‘ఎంఎ్‌సడీ.. మెయింటెయిన్‌ సోషల్‌ డిస్టెన్స్‌‘ అనే అక్షరాలతో కూడిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘కరోనాను జయించాలని, అందుకోసం ధోనీలా నాటౌట్‌గా ఉండాలనీ, వైరస్‌ను స్టంపవుట్‌ చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ..’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఉంచారు. ఇప్పుడీ ఫొటో నెట్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2020-07-08T08:11:02+05:30 IST