Quarantineలో ఉన్నారో లేదో... రోజుకు 5 సార్లు చెక్ చేస్తారట

ABN , First Publish Date - 2021-12-04T23:46:45+05:30 IST

Quarantineలో ఉన్నారో లేదో... రోజుకు 5 సార్లు చెక్ చేస్తారట

Quarantineలో ఉన్నారో లేదో... రోజుకు 5 సార్లు చెక్ చేస్తారట

ముంబై: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమైక్రాన్ ప్రభావంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ ప్రమాదంలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ను ముంబై అధికారులు తప్పనిసరి చేశారు. క్వారంటైన్‌లోకి వచ్చిన వారిని ముంబై మెడికల్ టీం అధికారులు రోజుకు 5 సార్లు చెక్ చేయనున్నారు. క్వారంటైన్‌‌లో వార్డు వార్ రూముల్లో ఉన్న వారి పరిస్థితి తెలుసుకునేందుకు మెడికల్ సిబ్బంది రోజుకు 5 సార్లు చెక్ చేస్తారు. ప్రయాణికులు నిబంధనలను పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు తనిఖీ చేయడానికి వైద్య బృందాలను అంబులెన్స్‌లతో క్రమం తప్పకుండా పంపుతారు. 7 రోజుల హోమ్ క్వారంటైన్, వార్డు వార్ రూముల్లో ప్రయాణీకులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తారు. శనివారం రోజు బీఎంసీ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

Updated Date - 2021-12-04T23:46:45+05:30 IST