కూతుర్ని తల్లిని చేసిన కసాయి తండ్రి

ABN , First Publish Date - 2020-08-26T13:21:42+05:30 IST

కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్ అయిన కన్నకూతురిపై రెండేళ్లుగా అత్యాచారం జరిపి, ఆమెను తల్లిని చేసిన కసాయి తండ్రి....

కూతుర్ని తల్లిని చేసిన కసాయి తండ్రి

ముంబై : కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్ అయిన కన్నకూతురిపై రెండేళ్లుగా అత్యాచారం జరిపి, ఆమెను తల్లిని చేసిన కసాయి తండ్రి బాగోతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది.ముంబై నగరంలోని పంత్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక రాజావాడీ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 


2018 మార్చి నుంచి ఈ ఏడాది జూన్ వరకు తన తండ్రి బెదిరించి అత్యాచారం చేశాడని, దీంతో తాను గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చానని కుమార్తె వైద్యులు, పోలీసులకు చెప్పింది. కూతుర్ని తల్లిని చేసిన కామాంధుడైన తండ్రిపై ఐపీసీ సెక్షన్ 376, సెక్షన్ 4,6,8,10,12, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్టు చేస్తామని ముంబై పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-08-26T13:21:42+05:30 IST