ముంబైలో 36 వేలకు చేరువైన కేసులు.. లాక్‌డౌన్ పొడిగింపు?

ABN , First Publish Date - 2020-05-29T23:20:08+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 60 వేలకు

ముంబైలో 36 వేలకు చేరువైన కేసులు.. లాక్‌డౌన్ పొడిగింపు?

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 60 వేలకు చేరుకుంటోంది. గత 24 గంటల్లో ఏకంగా 2500 కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను మరి కొంతకాలం పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నేడు, రేపు పరిస్థితిని సమీక్షించి అప్పుడు ఓ నిర్ణయానికి వస్తామని జల వనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. వైరస్ ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయన్నారు. రెడ్‌జోన్‌లోని ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్తుండడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్లను పెంచాల్సి ఉంటుందని అన్నారు. పరిస్థితి నియంత్రణలోకి వస్తుందన్న నమ్మకం తమకుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 59,546 కేసులు నమోదు కాగా, 1982 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-05-29T23:20:08+05:30 IST