కరోనా నియంత్రణ జోన్‌గా సీఎం నివాస ప్రాంతం...

ABN , First Publish Date - 2020-04-07T17:07:27+05:30 IST

దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాలను కరోనా నియంత్రణ జోన్లుగా....

కరోనా నియంత్రణ జోన్‌గా సీఎం నివాస ప్రాంతం...

మాతో శ్రీ వద్ద మున్సిపాలిటీ పోస్టర్లు

ముంబై : దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాలను కరోనా నియంత్రణ జోన్లుగా ప్రకటించింది.మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసభవనమున్న మాతో శ్రీ సమీపంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఒకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం రాత్రి సీఎం నివాసమున్న ప్రాంతాన్ని కరోనా నియంత్రణ జోన్ గా ప్రకటించారు. సీఎం నివాసం చుట్టుపక్కల మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేశారు. మంగళవారం ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావీలోని డాక్టర్ బాలిగా నగర్ ప్రాంతంలో కొత్తగా మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ధారావీలో మొత్తం ఏడుగురు కరోనా రోగులు ఆసుపత్రిలో చేరడంతో మురికివాడలోని పలు ప్రాంతాలను మున్సిపల్ అధికారులు సీలు వేశారు. కరోనా రోగులు ఎక్కువగా వెలుగుచూసిన ప్రాంతాల్లో పలు భవనాలకు అధికారులు సీలు వేశారు.

Updated Date - 2020-04-07T17:07:27+05:30 IST