Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ముంబయి కరాచీ హల్వా

ముంబయి కరాచీ హల్వా

కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి- కప్పు, చక్కెర- రెండు కప్పులు, నిమ్మరసం - స్పూను, నెయ్యి- ఆరు స్పూన్లు, ఏదైనా ఫుడ్‌ కలర్‌- పావు స్పూను, యాలకుల పొడి- పావు స్పూను, బాదం, జీడిపప్పు ముక్కలు- నాలుగు స్పూన్లు, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: వెడల్పాటి గిన్నెలో మొక్కజొన్న పిండికి, నాలుగు కప్పుల నీటిని కలపి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో చక్కెర, తగినంత నీటిని వేసి పాకం పట్టాలి. తీగ పాకం కాకమునుపే ఇందులో మొక్కజొన్న నీటిని వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు నిమ్మరసం వేయాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత ఫుడ్‌ కలర్‌, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు ముక్కలూ జతచేసి బాగా కలపాలి. ఆఖరున స్పూను నెయ్యి వేసి కలిపిన తరవాత ట్రేలోకి హల్వాను వంపుకుంటే సరి. పైన నట్స్‌తో అలంకరిస్తే బాగుంటుంది. ఓ అరగంట ఆరాక కట్‌ చేస్తే మంచిది.

మామిడికాయ హల్వామామిడికాయ హల్వాబాదం మైసూర్‌పాక్‌బాదం మైసూర్‌పాక్‌రాగి కేక్‌రాగి కేక్‌బర్ఫీబర్ఫీతిల్‌ గజక్‌తిల్‌ గజక్‌డ్రైఫ్రూట్‌ లడ్డూడ్రైఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ హల్వాడ్రై ఫ్రూట్‌ హల్వాడేట్స్‌ ఖీర్‌డేట్స్‌ ఖీర్‌బాదం బర్ఫీబాదం బర్ఫీప్రొటీన్‌  లడ్డూప్రొటీన్‌ లడ్డూ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.