రైజర్స్‌పై ముంబై విజయం

ABN , First Publish Date - 2021-04-18T04:54:22+05:30 IST

ముంబై ఇండియన్స్ మరో ఉత్కంఠభరింత విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలుపు అంచుల నుంచి పడదోసి విజయాన్ని కైవసం చేసుకుంది. 150 పరుగులను కాపాడుకుంటూ..

రైజర్స్‌పై ముంబై విజయం

చెన్నై: ముంబై ఇండియన్స్ మరో ఉత్కంఠభరింత విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలుపు అంచుల నుంచి పడదోసి విజయాన్ని కైవసం చేసుకుంది. 150 పరుగులను కాపాడుకుంటూ ముంబై బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కాగా.. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రౌజర్స్‌.. 19.4 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 13 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. తొలుత సూపర్ ఓపెనింగ్ దక్కినా, మిడిలార్డర్ దారుణ వైఫల్యంతో గెలుపునకు దూరమైంది. జానీ బెయిర్‌స్టో(43: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(37: 34 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా ఆటగాళ్లెవరూ అంచనాలకు తగినట్లు రాణించకపోవడంతో సన్‌రైజర్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది.




ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ 3 వికెట్లతో రాణించగా, జస్ప్రిత్ బుమ్రా ఓ వికెట్ తీశాడు. అయితే బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3.50తో బెస్ట్ ఎకానమీ నమోదు చేశాడు. ఈ విజయంతో ముంబై.. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో టాప్‌కు చేరింది. కాగా.. సన్‌రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడి ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవకపోవడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కాగా.. ముంబై తరపున చివరి ఓవర్లో రెండు సిక్స్‌లతో మెరిసి పొలార్డ్‌కు అనూహ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Updated Date - 2021-04-18T04:54:22+05:30 IST