Mumbai Indians : ముంబై ఇండియన్స్ యూఏఈ, సౌతాఫ్రికా ఫ్రాంచైజీల ఆవిష్కరణ.. పేర్లు ఇవే..

ABN , First Publish Date - 2022-08-11T02:35:10+05:30 IST

యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20(UAE's International League T20), క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల (Cricket South Africa T20 League)లలో పాల్గొనే ఫ్రాంచైజీల పేర్లు, బ్రాండ్‌లను ముంబై ఇండియన్స్(Mumbai Indians) యజమాన్య కం

Mumbai Indians : ముంబై ఇండియన్స్ యూఏఈ, సౌతాఫ్రికా ఫ్రాంచైజీల ఆవిష్కరణ.. పేర్లు ఇవే..

ముంబై : యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20(UAE's International League T20), క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల (Cricket South Africa T20 League)లలో పాల్గొనే ఫ్రాంచైజీల పేర్లు, బ్రాండ్‌లను ముంబై ఇండియన్స్(Mumbai Indians) యజమాన్య కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ బుధవారం ఆవిష్కరించింది. జట్ల పేర్లు ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్(MI Emirates), ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్(MI Cape Town)గా పేర్కొంది. కాగా ముంబై ఇండియన్ ఎమిరేట్స్ జట్టు యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్‌లో ఆడనుండగా.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్లు క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొననుంది.


ఫ్రాంచైజీల ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ(Nita Ambani) మాట్లాడారు. తమ ‘వన్‌ఫ్యామిలీ’లోకి కొత్త ఫ్రాంచైజీలు ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్‌లకు స్వాగతం పలకడంపట్ల గొప్ప సంతోషంగా అనిపిస్తోంది’ అని అన్నారు. ‘‘ మా వరకూ ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆవల కూడా ముఖ్యమైనది. కలలు నెరవేర్చుకునేందుకు ఈ 2 జట్లు మాకు తోడ్పాటునిస్తాయి. జీవితంలో భయం, బెరుకు లేకుండా ముందుకెళ్తాం. నిబద్ధతో పనిచేస్తూ ప్రపంచ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్‌ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తాం’’ అని నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. 





Updated Date - 2022-08-11T02:35:10+05:30 IST