వరుస ఓటముల్లో 2 జట్ల సరసన ముంబై ఇండియన్స్

ABN , First Publish Date - 2022-04-17T19:43:44+05:30 IST

ముంబై : ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదీ అంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్సే గుర్తుకొస్తుంది. ఎందుకంటే 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను ఆ జట్టు ముద్దాడింది.

వరుస ఓటముల్లో 2 జట్ల సరసన ముంబై ఇండియన్స్

ముంబై : ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదీ అంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్సే గుర్తుకొస్తుంది. ఎందుకంటే 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను ఆ జట్టు ముద్దాడింది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తావున్న ఆటగాళ్లు ముంబై ఇండియన్స్‌లో చాలామందే ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తిరుగేలేని ఆ టీం 2022లో ఇప్పటివరకు గెలుపు రుచిని చూడలేకపోయింది. ఆరు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ ఓడి అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇంత చెత్త ప్రదర్శన చేయడం ముంబై ఇండియన్స్‌కు ఇదేతొలిసారి. ఐపీఎల్ 2022లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్ ఆశలు కూడా దాదాపు గల్లంతయినట్టుగానే కనిపిస్తోంది. 


కాగా ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి. 2014లో వరుసగా 5 మ్యాచుల్లో ఓటమిపాలయింది. అప్పుడు కూడా సీజన్ ఆరంభ మ్యాచుల్లోనే పరాభవాన్ని ఎదుర్కొంది. కాగా ఐపీఎల్‌ చరిత్రలో మొదటి 6 మ్యాచుల్లో ఓటమిని చవిచూసిన మూడవ జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అంతకముందు ఢిల్లీ డేర్ డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్), రాలయ్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమే వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోయాయి. ఢిల్లీ డేర్ డేవిల్స్ 2013లో, ఆర్‌సీబీ 2019 సీజన్లలో మొదటి ఆరు మ్యాచుల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఆ రెండు జట్ల సరసన ముంబై ఇండియన్స్ చేరినట్టయింది. ఒకవేళ ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచులో కూడా ఓడిపోతే ఏమాత్రం కోరుకోని చెత్తరికార్డును తన పేరిట లిఖించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. మరి ఫలితం ఎలా ఉండబోతోందో వేచిచూడాలి.

Updated Date - 2022-04-17T19:43:44+05:30 IST