ఢిల్లీకి ఝలక్‌

ABN , First Publish Date - 2020-10-12T08:49:26+05:30 IST

ఒకే ఒక్క ఓటమితో దూసుకెళుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్‌ బ్రేక్‌ వేసింది. బంతితోనూ, బ్యాట్‌తోనూ ఆకట్టుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌....

ఢిల్లీకి ఝలక్‌

 రాణించిన డికాక్‌, సూర్యకుమార్‌

ముంబై విజయం


అబుదాబి: ఒకే ఒక్క ఓటమితో దూసుకెళుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్‌ బ్రేక్‌ వేసింది. బంతితోనూ, బ్యాట్‌తోనూ ఆకట్టుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌.. 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి ఓవర్‌కు సాగిన పోరులో సూర్యకుమార్‌ (53), డికాక్‌ (53) అర్ధసెంచరీలతో రాణించారు. వరుసగా నాలుగో విజయం సాధించిన ముంబై తిరిగి పాయింట్ల పట్టికలో టాప్‌నకు చేరింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ (69 నాటౌట్‌), శ్రేయాస్‌ అయ్యర్‌ (42) రాణించారు. వీరి ఇన్నింగ్స్‌లో ఒకే సిక్సర్‌ రావడం గమనార్హం. క్రునాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి నెగ్గింది. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డికాక్‌ నిలిచాడు. 


డికాక్‌, సూర్యకుమార్‌ అండతో..:

ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ (5) విఫలమైనా డికాక్‌ మాత్రం అదరగొట్టాడు. ఆరో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన తను 33 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి ముంబై విజయానికి బాటలు వేశాడు. పదో ఓవర్‌లో అశ్విన్‌ అతడిని అవుట్‌ చేసినా ముంబై ఇబ్బంది పడలేదు. సూర్యకుమార్‌  వరుసగా రెండో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇషాన్‌ (28)తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరితో పాటు హార్దిక్‌ (0) అవుయ్యాడు. చివరి 12 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉండడంతో 19వ ఓవర్‌లో నోకియా 3 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన క్రునాల్‌ జట్టుకు విజయాన్నందించాడు.


వేగం లేదు:

ఢిల్లీని తొలి ఓవర్‌ నుంచే ముంబై బౌలర్లు కట్టడి చేశారు. ధవన్‌ ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో ఉన్నా 69 పరుగులే చేశాడు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా (4) వికెట్‌ కోల్పోగా, డీసీ తరఫున మొదటిసారి బరిలోకి దిగిన రహానె (15) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఈ దశలో ధవన్‌, కెప్టెన్‌ శ్రేయాస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. స్పిన్నర్‌ క్రునాల్‌ 15వ ఓవర్‌లో శ్రేయా్‌సను అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి స్కోరు 109/3. ఇక మిగిలిన ఐదు ఓవర్లలోనైనా బ్యాట్లు ఝుళిపిద్దామనుకున్న ఢిల్లీకి పేసర్లు బౌల్ట్‌, బుమ్రా ఆ అవకాశం ఇవ్వలేదు. 17వ ఓవర్‌లో స్టొయినిస్‌ (13) రనౌట్‌ కాగా 18వ ఓవర్‌లో బుమ్రా 7 పరుగులే ఇచ్చాడు. చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ 35 పరుగులే చేసింది.


స్కోరుబోర్డు:

ఢిల్లీ: పృథ్వీ షా (సి) క్రునాల్‌ (బి) బౌల్ట్‌ 4, ధవన్‌ (నాటౌట్‌) 69, రహానె (ఎల్బీ) క్రునాల్‌ 15, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) బౌల్ట్‌ (బి) క్రునాల్‌ 42, స్టొయినిస్‌ (రనౌట్‌) 13; క్యారీ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 162/4. వికెట్ల పతనం: 1-4, 2-24, 3-109, 4-130. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-36-1; ప్యాటిన్సన్‌ 3-0-37-0; బుమ్రా 4-0-26-0; క్రునాల్‌ 4-0-26-2; పొలార్డ్‌ 1-0-10-0; రాహుల్‌ చాహర్‌ 4-0-27-0.


ముంబై:

రోహిత్‌ (సి) రబాడ (బి) అక్షర్‌ 5, డికాక్‌ (సి) పృథ్వీ షా (బి) అశ్విన్‌ 53, సూర్యకుమార్‌ (సి) శ్రేయాస్‌ (బి) రబాడ 53, ఇషాన్‌ (సి) అక్షర్‌ (బి) రబాడ 28, హార్దిక్‌ (సి) క్యారీ (బి) స్టొయినిస్‌ 0, పొలార్డ్‌ (నాటౌట్‌) 11, క్రునాల్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.4 ఓవర్లలో 166/5. వికెట్ల పతనం: 1-31, 2-77, 3-130, 4-130, 5-152. బౌలింగ్‌: రబాడ 4-0-28-2, నోకియా 4-0-28-0, అక్షర్‌ 3-0-24-1,  అశ్విన్‌ 4-0-35-1, హర్షల్‌ పటేల్‌ 2-0-20-0, స్టొయినిస్‌ 2.4-0-31-1.

Updated Date - 2020-10-12T08:49:26+05:30 IST